Ys jaganmohan reddy on telanagan ap issues

ysrcp, ys jagan, jaganmohanreddy, trs, ap, telangana, polavaram, court, speaker,

ys jaganmohan reddy on telanagan, ap issues: ysr congress party president ysjagan reddy rising some issues about telangana and ap. ysrcp decided to appeal the court for dismiss the mlas, who won from ysrcp and joined in trs.

జగన్ పలుకు.. వైస్ఆర్ కాంగ్రేస్ పలుకు

Posted: 03/09/2015 09:22 AM IST
Ys jaganmohan reddy on telanagan ap issues

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ నవ్వుతూనే పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కుందని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇదే అంశంపై సభలో తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని నిలదీయాలని జగన్ పిలుపునిచ్చారు.  పెన్షన్‌ వెయ్యి రూపాయలు అంటూనే, ఎక్కువ మందిని జాబితాలోంచి తొలగించిన అంశాన్నిసభలో ప్రస్తావించాలన్నారు. రూ.500 కోట్లిచ్చామని చెబుతున్నా వాస్తవంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించాలని జగన్‌ పేర్కొన్నారు. కాగా, వైసీపీ తరఫున ఎన్నికై టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలంటూ వైసీపీ కోర్టును కోరనుంది.

ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంటులో బీజేపీ కాంగ్రెస్‌ కలిస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుందని జగన్‌ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు విషయంలో టీడీపీ పెద్దగా నోరుమెదపడంలేదని, దీన్ని పార్లమెంటులో గట్టిగా ప్రస్తావించాలని వైసీపీ నిర్ణయించింది. ఏపీకి రావాల్సిన వాటిలో బీజేపీ టీడీపీ దొంగాట ఆడుతున్నాయని, ప్రత్యేకహోదా పదేళ్లు కావాలన్న వెంకయ్యనాయుడు కేంద్రమంత్రి పదవిలోకి రాగానే హోదా సాధ్యం కాదనడం సరికాదని వైస్ఆర్ కాంగ్రెస్ మండిపడింది. ఏటా రెండు కన్నా ఎక్కువ పంటలు పండించే భూముల్ని సేకరించేందుకు తాము వ్యతిరేకరమని వైసీపీ పేర్కొంది. రైతుల సామాజిక ప్రభావాన్ని అంచనా వేయకుండా భూసేకరణ చట్టాన్ని తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వానికి మద్దతివ్వబోమని స్పష్టం చేసింది. మొత్తానికి తెలంగాణ, ఏపిలకు జరుగుతున్న అన్యాయాలపై జగన్ నోరువిప్పారు. భవిష్యత్ కార్యచరణపై దృష్టి సారించారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  ys jagan  jaganmohanreddy  trs  ap  telangana  polavaram  court  speaker  

Other Articles