తెలంగాణలోని యాదగిరిగుట్ట క్షేత్రాన్ని ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి సూచన మేరకు యాదగిరిగుట్టను ఇకపై యాదాద్రిగా వ్యవహరించాలని నిర్ణయించారు. యాదగిరిగుట్టగా ఇప్పుడున్న కొండతో పాటు చుట్టుపక్కల మరో ఎనిమిది కొండలను కలిపి నవగిరులుగా, అద్భుత ఆధ్మాత్మిక క్షేత్రాలుగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన కొండకు యాదాద్రిగా నామకరణం చేసిన జీయర్ స్వామి, మిగిలిన ఎనిమిది కొండలకు త్వరలో పేర్లు పెడతామని సీఎంకు తెలిపారు. జీయర్‌స్వామికి హెలికాప్టర్ నుంచి ఆలయ అభివృద్ధి ప్రణాళికలను, వాటికి కేటాయించే స్థలాలను సీఎం చూపించారు. మొత్తం ఆలయాలను దర్శించడానికి వీలుగా మోనో రైలు, దేవస్థానం తరపున ప్రయాణ సౌకర్యాలు కల్పించే ఆలోచన ఉన్నట్టు చినజీయర్‌స్వామికి సీఎం కేసీఆర్ చెప్పారు.
ఆగమ శాస్త్ర ప్రకారం గర్భాలయం, ఆంజనేయ స్వామి విగ్రహాల స్థలాల్లో ఎలాంటి మార్పు లేకుండా.. కృత్రిమత్వం కనబడకుండా శిల్పకళ ఉట్టిపడే విధంగా నిర్మించాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఆలయ మండపం ఎదుట ఎలాంటి కట్టడాలు లేకుండా విశాలమైన హరిత నందనం ఏర్పాటు, వాహనాల పార్కింగ్ వంటి నిర్మాణాలు చేపడుతున్నట్టు వివరించారు. క్షుణ్ణంగా ప్లాన్‌ను పరిశీలించిన జీయర్ స్వామి ముసాయిదా ప్రణాళిక ఆగమ శాస్త్ర ప్రకారమే ఉందని తెలిపారు. ఆలయ ప్రాకారం బయట దుకాణాల సముదాయాన్ని సైతం ఆధ్యాత్మికశోభతో కళాత్మకంగా నిర్మించాలని జీయర్‌స్వామి సూచించారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం అనుకున్న విధంగా యాదగిరి పుణ్యక్షేత్రం కొత్త రూపు సంతరించుకోవడానికి సర్వం సన్నద్దమవుతోంది. మరి కొన్ని నెలల్లోనే పాత యాదగిరి స్థానంలో, కొత్త యాదాద్రిని భక్తులు చూడవచ్చు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
May 19 | పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన... Read more
May 19 | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల... Read more
May 19 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని... Read more
May 19 | వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వారణాసిలోని స్థానిక కోర్టు ఈ కేసును విచారించకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ఈ కేసులో శుక్రవారం మధ్యాహ్నం... Read more
May 19 | నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు ప్రతీరోజు నదుల్లోనే స్నానం చేస్తుంటారు. నదీ సాన్నాలు ఆచరించడం వారి జీవన విధానంలో భాగమైపోతుంది. క్రమంగా అడవులు తగ్గడం, వర్షాలు కురవకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రవహించాల్సిన నదులు కూడా నానిటికీ... Read more