Pawankalyan press meet today

pawankalyan, pressmeet, janasena, pawanto press, mediameet,

pawankalyan press meet today. janasena party founder pawankalyan will participate in press meet today. yesterday pawan did tour in ap capital city villages.

మరి కొద్దిసేపట్లో పవన్ మీడియా సమావేశం

Posted: 03/06/2015 10:52 AM IST
Pawankalyan press meet today

నిన్న రాజధాని గ్రామాల్లో పర్యటించి, వారి సమస్యలు విన్న పవన్ కళ్యాన్ ఈ ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. రాజధాని గ్రామాలైన ఎర్రబాలెం, తూళ్లూరు, ఉండవల్లి తదితర గ్రామాల్లో పర్యటించిన పవన్, గ్రామస్తుల, రైతుల సమస్యలను సావధానంగా విన్నారు. వారి నుండి భూములను బలవంతంగా లాక్కోవడాన్ని పవన్ వ్యతిరేకించారు. రైతుల పొలాలను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తే, వారి తరఫున దీక్షకు కూడా సిద్దంమని ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజధాని నిర్మాణం ప్రపంచ స్థాయిలో ఉండాలని తాను కూడా అనుకుంటున్నానని, కానీ రైతులు కన్నీరు పెట్టుకుంటే, అలాంటి రాజధాని నిర్మాణం అవసరమా అని ప్రశ్నించారు.

ఎన్నికలకు ముందు జనసేన పార్టీని ప్రారంభించినా, ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలను చేపట్టని పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల్లో మొదటి పర్యటన చేశారు. పవన్ పర్యటనకు విశేష స్పందన రావడం, వపన్ చేసిన మాటలు రాజకీయ పార్టీల్లో కలవరం రేపుతున్నాయి. అయితే రాజధానినిర్మాణంలో భాగంగా రైతుల నుండి పొలాలను లాక్కోవడంపై పవన్ తీవ్రంగా ఆవేదనకు గురవుతున్నారు. పవన్ నేటి మీడియా సమావేశంలో ఏయే విషయాలు మాట్లాడతారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawankalyan  pressmeet  janasena  pawanto press  mediameet  

Other Articles