Isis themed wedding in egypt

ISIS-themed wedding in Egypt, ISIS-themed wedding, ISIS-themed wedding bride and groom were placed in a cage, ISIS-themed wedding surrounded by masked men, ISIS-themed wedding brandishing knives, ISIS-themed wedding video, ISIS-themed wedding video shot in Egypt Menoufia, jihadi anthem at ISIS-themed wedding,

An Egyptian bride and groom were placed in a cage, surrounded by masked men, brandishing knives as part of an IS-themed wedding, sky.com said.

ITEMVIDEOS: ఈజిప్టులో ఇస్లామిక్ స్టేట్ నేపథ్యంలో పెళ్లి

Posted: 03/05/2015 01:45 PM IST
Isis themed wedding in egypt

ఈజిప్టులో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఇరాక్ ఉగ్రవాద నేపథ్యంలో జరిగిన వివాహ వేడుక వీడియో ప్రస్తుత్తం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది నిజంగానే ఐస్లామిక్ స్టేట్ ఉగ్రవాద నేపథ్యంలో జరిగిన పెళ్లంటూ స్కై డాట్ కామ్ సంస్ధ నెట్ లో అప్ లోడ్ చేసింది. అయితే ఇది అన్ని మహ్మదీయ సంప్రదాయ పెళ్లిళకు భిన్నంగా వధూవరులు ఇద్దరూ ఒకే వేదికపై కూర్చన్నారు. అంతే కాదు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ముఖాలకు మాస్కులు ధరించి పొడువాటి కత్తులు ( తల్వార్ల తరహాలో వున్న) తిప్పుతూ ప్రదర్శించారు. దీనికి తోడు కొద్ది సేపటికి వారు వధువధులిద్దరినీ వివాహ వేదిక పైనుంచి సాదరంగా ఒక పెద్దని పంజరంలోకి తీసుకెళ్లారు. అంతటితో ఆగకుండా ఆ పంజరంలోనే వారు నృత్యాలను ఆళపించారు.

వివాహ సందర్భంగా వినిపించాల్సిన సంప్రదాయ ఆచారాలకు బదులు.. జీహాదీ జాతీయ గీతాన్ని ఆలపించారు. దీనిపైనే వధూవరులతో పాటు ఉగ్రవాదులు కలసి పంజరంలో నృత్యాలు చేశారు. అయితే ఉగ్రవాద చర్యలకు విస్తుపోయిన వధువు మాత్రం బిత్తరపోయనట్లుంది. ఈ వీడియోను ఈజిప్టులోని మెనౌఫియా ప్రాంతంలో జరిగిన పెళ్లిలో చిత్రీకరించినట్లు స్కై డాట్ కామ్ తెలిపింది. ఇక అసలు విషయానికి వస్తే.. వరుడు తనకు కాబోయే వధువును పెళ్లికి ముందే భయకంపితురాలి చేయాలని నిర్ణయించుకుని ఈ తరహాలో షోను ఏర్పాటు చేశాడని ఎట్టకేలకు భయపడింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS-themed wedding  Egypt  Menoufia  

Other Articles