Nirbhaya rapist interview will telacast today on bbc

nirbhaya, rapist, bbc channel, homeministry, telecast, documentary, parliament

bbc cahnnel decided to telacast nirbhaya rapist interview today night. late in the evening, the BBC, which has the rights to telecast the documentary, advanced its airing to 2200 hours GMT on Wednesday (3:30 am Thursday) from the original schedule of March 8.

నిర్భయ నిందితుడి ఇంటర్వు ప్రసారం నేడే.. బిబిసి నిర్ణయం

Posted: 03/05/2015 09:26 AM IST
Nirbhaya rapist interview will telacast today on bbc

దేశవ్యాప్తంగా తాజా సంచనానికి కారణమైన నిర్భయ నిందితుడి ఇంటర్వూ వివాదం కొత్త మలుపు తిరిగింది. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డ నేపథ్యంలో ప్రభుత్వం డాక్యుమెంటరీని అడ్డుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రభుత్వం తరఫున కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ లో ఓ ప్రకటన చేశారు. నిర్భయ నిందుతుడి ఇంటర్వూను ఎట్టి పరిస్థితిలోనూ ప్రసారం కానివ్వం అంటూ ప్రకటించారు. మరో పక్క ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ పై కోర్టు కూడా తీర్పును వెల్లడించింది. ఈ డాక్యుమెంటరీని ప్రసారం కాకుండా అడ్డుకోవాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది.

నిర్భయ హంతకుడు ముఖేష్‌తో జరిపిన వివాదాస్పద ఇంటర్వ్యూ డాక్యుమెంటరీని ప్రసారం చేయవద్దని భారత్ చాలా గట్టిగా కోరినప్పటికీ బిబిసి పట్టించుకోలేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయాలని బిబిసి భావించింది. అయితే, భారత్‌తో చెలరేగుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని బుధవారం రాత్రి పది గంటలకు దీన్ని ప్రసారం చేయాలన్న నిర్ణయం తీసుకుంది. అత్యంత శక్తివంతమైన ఈ డాక్యుమెంటరీని ముందుగానే చూసే అవకాశం ప్రేక్షకులకు కల్పిస్తున్నామని తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. యూకెలో బిబిసి-4లో దీన్ని ప్రసారం చేస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. బాధిత నిర్భయ తల్లిదండ్రుల పూర్తి సహకారం, మద్దతుతోనే డాక్యుమెంటరీని రూపొందించినట్టు వివరించింది. సునిశితమైన ఈ అంశాన్ని అంతే బాధ్యతాయుతంగా చేపట్టామని, నిబంధనలకు అనుగుణంగానే తమ డాక్యుమెంటరీ ఉందని వెల్లడించింది. అయితే డాక్యుమెంటరీని అడ్డుకోవాలని నిరసనలు కూడా ఎక్కువ కావడంతో ప్రభుత్వంపై తీవ్ర వత్తిడి ఏర్పడుతోంది. మొత్తానికి బిబిసి ఆ డాక్యుమెంటరీని ప్రసారం చేస్తుందా లేదా అని ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nirbhaya  rapist  bbc channel  homeministry  telecast  documentary  parliament  

Other Articles