Janasena party founder pawankalyan to thullur

pawankalyan, janasena, powerstar, pawanisam, ap, capital, budget,

janasena party founder pawankalyan to thullur.ap capital city around villgers and farmers getting ready to pawan kalyan arrival. janasena party first public visit on today.

ప్రజల్లోకి పవన్ కళ్యాణ్.. తూళ్లూరు బయలుదేరిన జనసేన అధినేత

Posted: 03/05/2015 08:58 AM IST
Janasena party founder pawankalyan to thullur

పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం అంటూ జనసేన పార్టీని స్థాపించి తెలుగు గడ్డపై మరో పార్టీకి పురుడు పోశారు పవన్ కళ్యాణ్. సినిమాలో ఎప్పుడూ సామానికి కోణాన్ని ప్రతిబింబించే పవన్, నిజ జీవితంలోనూ సేవా కార్యక్రమాలకు ముందుంటారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు పార్టీలో కీలకంగా వ్యవహరించి, తరువాత పార్టీ సంక్షోభంతో కాస్త రాజకీయాలకు దూరమయ్యారు. అయితే తరువాత చాలా రోజుల తర్వాత రాజకీయాల వల్లే ప్రజలకు సేవ చెయ్యవచ్చని నమ్మి, జనసేన పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. ప్రారంభ ఉపన్యాసం నుండే తాను అందరిలా కాదు అని చెప్పారు. ప్రజల పట్ల తనకున్న కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. అన్ని పార్టీల్లాగా ఎదుటి వారిపై ఎప్పుడూ దుమ్మెత్తి పొయ్యడం ఆపి, ప్రజా సంక్షేమాన్ని గురించి ఎప్పుడూ మదనపడుతుంటారు పవన్ కళ్యాణ్.

తాజాగా ఏపి రాజధాని నిర్మాణానికి గాను ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు సంబందించి, రైతులు, గ్రామస్తుల నుండి వస్తున్న వినతులపై పవన్ కళ్యాణ్ స్పందించారు. తానే స్వయంగా రాజధాని గ్రామాల్లో పర్యటించి, సమస్యలను తెలుసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ తూళ్లూరులో పర్యటన జరపనున్నారు. ఉదయం 7గంటల 30నిమిషాలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుండి గన్నవరం బయలుదేరారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో ఉండవల్లి, బేతపూడి, ఎర్రబాలెం, తూళ్లూరులో పవన్ కళ్యాణ్ పర్యటన జరగనుంది. అందులో భాగంగా పవన్ ప్రజలతో మమేకం కావడానికి సిద్దంగా ఉన్నారు. అయితే పార్టీని స్థాపించిన తరువాత మొదటిసారి తలపెట్టిన ప్రజాయాత్రపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజధాని నిర్మాణం వల్ల రైతులకు కలుగుతున్న ఇబ్బందులుపై ప్రజల నుండి విన్నపాలు స్వీకరించనున్నారు పవన్. గతంలోనే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుండి ఎలాంటి నిధులు రాకపోవడంపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపికి అన్ని రకాలుగా న్యాయం చెయ్యాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఎన్నికల సమయంలో మోదీతో ఎంతో సన్నిహితంగా మెలిగిన పవన్ తమ సమస్యలకు పరిష్కారం చూపుతారని రాజధాని గ్రామాల్లోని ప్రజలు నమ్ముతున్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawankalyan  janasena  powerstar  pawanisam  ap  capital  budget  

Other Articles