బడ్జెట్ పై మోదీ ప్రశంసలు కురిపించారు. అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ క్లీయర్ విజన్ కలిగి ఉందని ట్వీట్ చేశారు. ఓ వైపు అరుణ్ జైట్లీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుంటే, మరో పక్క మోదీ ట్విట్టర్ లో ట్వీట్ ల మోత మోగించారు. మధ్య తరగతి, పేద, యువతకు పెద్ద పీట వేస్తున్న బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నందుకు అరుణ్ జైట్లీ గారిని అభినందించాల్సిందేనన్నారు. కొత్త ఆవిష్కరణకు, కొత్త ఆలోచనలకు భారత్ ప్రాధాన్యత ఇస్తోందని, భారత్ వెలిగిపోవడానికి ఎంతో కృషి చేస్తున్నమని తెలిపారు. సురక్షా భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, జీవన్ జ్యోతి భీమా యోజన, విద్యాలక్ష్మి కార్యక్రమ్ లాంటివి జన్ ధన్ నుండి జన్ కళ్యాణ్ దిశగా అడుగులు వేస్తోందని అన్నారు.
బ్లాక్ మనీని రప్పించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామని అందులో భాగంగా బడ్జెట్ లో కొత్త చట్టాన్ని ప్రతిపాదించామని అన్నారు. దేశంలోని ఈశాన్య, మరి కొన్ని రాష్ట్రాలకు కూడా సమ ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. 2022 నాటికి అందరికి ఇళ్లు, ఉద్యోగాలు, విద్య, విద్యుత్, ఆరోగ్యం అందిస్తామని ఆ దిశగా బడ్జెట్ ఉందని అన్నారు. బడ్జెట్ ప్రోగ్రెసివ్, పాజిటివ్, ప్రాక్టికల్ గా ఉందని ట్వీట్ చేశారు. పనిలో పనిగా ప్రధాని మోదీ భారత శాస్ర్తవేత్తల గొప్పదనాన్ని కీర్తించారు. దేశ అభివృద్దిలో శాస్ర్తవేత్తల పాత్ర ఎంతో కీలకమని, ప్రస్తుతం మనం మెరుగైన పరిస్థితుల్లో ఉన్నామంటే దానికి శాస్ర్తవేత్తల కృషి కారణమని ఆయన అన్నారు. భారత దేశ భవిష్యత్తును సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్ణయిస్తున్నాయని అన్నారు. శాస్ర్తవేత్తల దృఢమైన సంకల్పం దేశానికి ఎంతో మేలు చేశాయని అన్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more