పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలిసారి పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా తమ వ్యయం మోత్తాన్ని 17 లక్షల 77 వేల 477 కోట్ల రూపాయలుగా పేర్కోన్న ఆయన ప్రణాళికా వ్యయాన్ని 4 లక్షల 65 వేల 277 కోట్ల రూపాయలుగా వెల్లడించారు. ప్రణాళికేతర వ్యయంగా 13 లక్షల 12 వేల 200 కోట్ల రూపాయలుగా జైట్లీ ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగాన్ని చేసిన ఆయన ఇప్పటికి కొన్ని పూలు పూయించాం.. మరికొన్ని పూయించాల్సి ఉంది, కానీ ఈ దారిలో తోటలో ముళ్లు చాలా తొలగించాల్సి ఉంది'' అన్నారు. తమది రోజుకు 24 గంటలూ, ఏడాదికి 365 రోజులూ పనిచేసే ప్రభుత్వమన్నారు.. కరెంటు ఖాతా లోటు జీడీపీలో 1.3 శాతం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. జీడీపీ బాగా పెరగుతోందన్నారు. దీంతో ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటిగా కనిపిస్తోందన్నారు.
బాలికల విద్య, యువతకు ఉపాధి, పన్నుల సంస్కరణలు, పెట్టుబడులు, ఉద్యోగావకాశాల కల్పన, డిజిటల్ కనెక్టివిటీ, ప్రభుత్వంలో మెరుగైన పనితీరు, ఈశాన్య రాష్ట్రాల్లో మెరుగైన కనెక్టివిటీ అన్నీ ఉండాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా 2014-15లో 50 లక్షల టాయిలెట్లు కట్టించామని ఈ ఏడాది వాటి సంఖ్యను 6 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.. జనధన్ యోజనతో మధ్యవర్తల ప్రమేయం లేకుండా ప్రజలకు ప్రభుత్వ ప్రయోజనాలను నేరుగా అందిస్తామని చెప్పారు.
ఈ ఏడాది ఆర్బీఐ చట్టాన్ని సవరిస్తాం. రెండంకెల వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతుంది. అప్పటికి దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పట్టణ భారతంలో 2 కోట్ల ఇళ్లు, గ్రామీణ భారతంలో 4 కోట్ల ఇళ్లు కట్టాలని లక్ష్యం పెట్టుకున్నాట్లు చెప్పారు. ప్రతి ఇంటికీ 24 గంటల విద్యుత్ సరఫరా, నీటి సరఫరా ఉండాలని తమ ప్రభుత్వం నిర్ధేశించుకున్నట్లు చెప్పారు. దేశంలో మిగిలిన 20 వేల గ్రామాలకు కూడా విద్యుత్ సరఫరా కోసం సౌర విద్యుత్ కల్పించాలని భావిస్తున్నట్లు చెప్పారు..
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more