Ts govt issue the rules and regulations for deepam project

deepam, ts deepam, sc, st, collector, lpg connection, cylender

telanagana govt issue the rules and regulations for deepam project. in that govt. order clear that deepam programmee maintained by the dist. collector. collector will ba the supreme for this scheme. poor sc, st familys are alegibile for deepam.

త్వరలో వంటిట్లో దీపం.. మార్గదర్శకాలు విడుదల

Posted: 02/27/2015 09:09 AM IST
Ts govt issue the rules and regulations for deepam project

రాష్ట్రంలోని పేద మహిళలకు దీపం కనెక్షన్లు అందచేసేందుకు సర్కారు సమాయత్తం అవుతోంది. నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్లు ఛైర్మన్‌గా ఐదుగురు సభ్యులతో జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈసారి దీపం కనెక్షన్ల విషయంలో ఐకేపీ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పేదరికరేఖకు దిగువన ఉన్న పేదవర్గానికి చెందిన ఎస్టీ ఎస్సీ మైనారిటీ తదితర మహిళలను మాత్రమే ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల జాబితాలను స్థానిక సంస్థల కార్యాలయాల్లో ప్రకటించి అభ్యంతరాల నమోదుకు అవకాశమిచ్చిన అనంతరమే ఎంపిక చేస్తారు. ఈ ఎంపికలో సర్పంచులు, మున్సిపల్ కార్పొరేటర్లను సంతకాలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎంపిక కమిటీ కన్వీనర్‌గా జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వ్యవహరిస్తారు. ఐకేపీ రూరల్ ప్రాజెక్టు డైరెక్టర్, ఐకేపీ అర్బన్ ప్రాజెక్టు డైరెక్టర్, రాష్ట్రంలో ఉన్న మునిసిపాలిటీల కమిషనర్లు, ఎల్పీజీ జిల్లా స్థాయి కో ఆర్డినేటర్ సభ్యులుగా ఉండనున్నారు.

దీపం కనెక్షన్ల మంజూరులో జిల్లా కలెక్టరుకు పూర్తి అధికారాలు అప్పగించనున్నారు. లబ్ధి దారుల ఎంపిక, జారీ ప్రక్రియ కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది. ఐకేపీ గ్రూపులకు అత్యంత ప్రాధాన్యత ఉండబోతోంది. పేద తరగతికి చెందిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, తదితర మహిళలు మాత్రమే ఇందుకు అర్హులు. వంటగ్యాస్ అవసరమున్న వారికే దీపం కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎల్పీజీ లేదా దీపం కనెక్షన్ లేనివారు, ఎల్పీజీ సిలిండర్‌కు డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉన్న వారు మాత్రమే కొత్తగా దీపం పథకానికి అర్హులుగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : deepam  ts deepam  sc  st  collector  lpg connection  cylender  

Other Articles