Ttdp leader revanth reddy attacks on trs

Revanth reddy, Trs, Namasthetelangana, Kcr, Jagadeshwar reddy, Eetela rajender, Mission Kakatiya

ttdp leader revanth reddy attacks on trs. he said that namasthe telanagan is a waste paper. kcr is fearing about the media so he avoid the media added. trs leaders are fearing while revanth hold the mich.

మైక్ పడితే వణుకుతున్న టిఆర్ఎస్ నేతలు: రేవంత్ రెడ్డి

Posted: 02/27/2015 09:12 AM IST
Ttdp leader revanth reddy attacks on trs

తెలంగాణ అసెబ్లీలొ తెలుగుదేశం పార్టీ తరఫున తెరాసపై మాటల దాడికి దిగిన టిడిపి నేత రేవంత్ రెడ్డి, తాజాగా మరో సారి కెసిఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మానస పుత్రిక నమస్తే తెలంగాణ పేపర్ చెల్లని కాగితం అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.  తాను మైక్ పట్టుకుంటే  తెరాస నేతలు వణుకుతున్నారని అన్నారు. సాక్షాత్తు మంత్రికి కూడా తెలియకుండా చెక్‌పోస్టులు ఎత్తివేసినందుకు మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ ఓ మిషన్‌ కరెప్షన్‌ అన్నారు. అక్రమాలు బయటపెడతారనే జర్నలిస్టులపై ఆంక్షలు విధించారని ఆరోపించారు. ఎర్రగడ్డ ఛెస్ట్ ఆసుపత్రిని తొలగించి, అక్కడకు సచివాలయాన్ని తరలించాలన్న ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు.

 రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి బీజేపీ నేతలే సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణకు రైల్వే ప్రాజెక్టులను సాధించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విఫలమయ్యారన్నారు. ఇక తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై వస్తున్న ఆరోపణల గురించి కూడా విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్న ప్రభాకర్ రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజాలు తేలాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోతోందని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని వెల్లడించారు. తెలుగుదేశం హయాంలో నక్సల్స్ చాలా ఇబ్బంది పెట్టేవారని, అప్పుడు వారు లేకుంటే బాగుండు అనిపించేదని అన్నారు. కానీ ఇప్పుడు కేసిఆర్ పాలన చూస్తుంటే వాళ్లుంటే బాగుండనిపిస్తోందని, వారే కెసిఆర్ కు తగిన పాఠం చెప్పే వారని రేవంత్ అన్నారు.  
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth reddy  Trs  Namasthetelangana  Kcr  Jagadeshwar reddy  Eetela rajender  Mission Kakatiya  

Other Articles