Ahmadabad officails announce section 144 for swineflu

swineflu, gujarath, health department, health ministry, jp nadda, ahmadabad

in the gujarat state officails announce section 144 for swineflu: in india swineflu cases rise day byday. the central govt fail to control the swineflu. central health minister said that no need to worry about the swineflu.

సెక్షన్ 144 అమల్లోకి వచ్చింది.. ఎందుకంటే స్వైన్ ఫ్లూ వస్తోంది

Posted: 02/26/2015 08:47 AM IST
Ahmadabad officails announce section 144 for swineflu

సెక్షన్ 144 గురించి అందరికి తెలుసు. ఎవైనా హింసాత్మక ఘటనలు జరిగినపుడు, శాంతి భద్రతలకు విఘాతం కలిగినపుడు ఈ సెక్షన్ ను విధిస్తారు. ఎలక్షన్ టైంలోనూ దీన్ని వాడతారు. అయితే శాంతి భద్రతలకు ఎలాంటి సంబందం లేకుండా స్వైన్ ఫ్లూ రోజురోజుకు పెరుగుతుండటంతో తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అధికారులు సెక్షన్ 144 ను విధించారు. అదేంటి 144 సెక్షన్ విధించడం అనుకుంటున్నారా, మరదే అక్కడ స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగతోందట. వైద్యులు వాటిని నియంత్రించడంలో తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు. చేసేదేంలేక అక్కడి కలెక్టర్ ఇలా 144 సెక్షన్ విధించి, ప్రజలను గుంపులుగా తిరగవద్దని అంటున్నారు. వేగంగా వ్యాపిస్తున్న స్వైన్ ఫ్లూ ను కాస్తైనా నియంత్రించాలంటే ఇక అత్యవసర సమయాల్లో వాడే 144 సెక్షనే కరెక్ట్ అనుకున్నారేమో స్థానిక కలెక్టర్. అందుకే స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది, దాన్ని నియంత్రించాలంటే ఇలా 144 సెక్షన్ ను విధించాం అంటూ కలెక్టర్ ప్రకటించారు.

దేశంలో స్వైన్‌ఫ్లూ వైరస్‌ విజృంభణపై ప్రజల్లో ఆందోళన నేపథ్యంలో భయపడాల్సిందేమీ లేదని, జాగ్రత్తలు పాటిస్తే చాలునని కేంద్రం సూచిస్తోంది. వ్యాధి నివారణ, నియంత్రణ కోసం అన్నిరకాల చర్యలు తీసుకున్నామని, అన్నిరాష్ట్రాల్లో మందులు, వైద్యపరీక్షల సదుపాయాలు అందుబాటులో ఉంచామని ఆరోగ్యశాఖ మంత్రి జె.పి.నడ్డా  చెప్పారు. వ్యాక్సిన్‌ విషయానికొస్తే, దానివల్ల 100శాతం రక్షణ లభించే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడినట్లు తెలిపారు. స్వైన్‌ఫ్లూపై కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి ఎప్పటికప్పుడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమీక్షిస్తున్నారని చెప్పారు. స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య రోజుకోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇలా చివరకు 144 సెక్షన్ ను కూడా వాడాల్సి రావడం గమనార్హం.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swineflu  gujarath  health department  health ministry  jp nadda  ahmadabad  

Other Articles