Anna will call for jailbharo

anna hazare, anna, anti govt, land pooling, acquisiation, bill, parliament, modi, corporate circles, farmers

anna hazare announce that if the govt willnt to quit the land acquisiation bill, he will to call for jailbharo. anna hazare oppose the land aquisiation bill, it is anty for farmers. govt trying to banefit corporate circles only.

మాటవినకపోతే జైల్ భరో నిర్వహిస్తాం: అన్నా హజారే

Posted: 02/26/2015 09:03 AM IST
Anna will call for jailbharo

భూసేకరణ చట్టంలో సవరణలపై కేంద్ర ప్రభు త్వం దేశప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని గాంధేయవాది అన్నా హజారే విమర్శించారు. కొత్త చట్టం ప్రభావవంతంగా, రైతు నేస్తంగా ఉంటుందని మోదీ సర్కారు చెప్తున్నవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. నల్లధనం, రాష్ర్టాలకు అధికారాల బదలాయింపువంటి అన్నిఅంశాలపై బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని ఆరోపించారు. తమ డిమాండ్లను పట్టించుకోకుంటే దేశవ్యాప్తంగా జైల్‌ భరో కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. భూసేకరణ చట్టసవరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్ష మంగళవారమే ముగిసినప్పటికీ రైతు ప్రతినిధులు ఆలస్యంగా రావటంతో వారితో హజారే ముచ్చటించారు. రైతులకంటే పారిశ్రామికవేత్తల గురించే ప్రభుత్వం అధికంగా ఆందోళన చెందుతున్నది. ప్రభుత్వం ఇప్పుడు అధికార మత్తు లో ఉన్నది. ఇది మద్యం మత్తుకంటే ప్రమాదకరమైంది. వాళ్లు (ప్రభుత్వం) వ్యవసాయ భూములను లాక్కొని పారిశ్రామికవేత్తలకు ఇవ్వబోతున్నారు. ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసేందుకు 8-10 మందితో ఓ కమిటీని వేయనున్నాం. దేశవ్యాప్త ఉద్యమ కార్యాచరణను నిర్ణయించిన తర్వాత జైల్‌భరో కార్యక్రమానికి పిలుపునిస్తాం అని తెలిపారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anna hazare  anna  anti govt  land pooling  acquisiation  bill  parliament  modi  corporate circles  farmers  

Other Articles