Nitish kumar takes oath as bihar chief minister

Nitish Kumar takes oath as Bihar Chief Minister, Nitish Kumar takes oath as cm, governer KN Tripathi swears nitish kumar, 22 legislators taken oath as ministers, nitish kumar cabinet with 22 ministers, .bihar trust vote, nitish to show his majority, Manjhi steps down as bihar cm, nitish kumar returned as bihar cm, bihar former chief minister jitin ram manjhi, Nitish Kumar, Jitan Ram Manjhi, Dissolution, Bihar CM, bihar assembly polls, Manjhi expelled from JD(u), Bihar CM, Jitam Ram Manjhi, Narendra Modi, Nitish Kumar, Political Play, Sharad Yadav, janata dal united president, manjhi greets nitish, janata pariwar

Nitish Kumar took oath Sunday evening for the fourth time as the chief minister ending a month long political turmoil in Bihar.

నితీష్ కు మళ్లీ దక్కిన అధికార దర్పం..

Posted: 02/22/2015 09:14 PM IST
Nitish kumar takes oath as bihar chief minister

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ తీవ్ర రాజకీయ సంక్షోభానికి తెరలేపిన అనంతరం జతిన్ రామ్ మాంఝీ తన సీఎం పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో నితీష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నితీష్ నాల్గోసారి సీఎంగా  ఎన్నికయ్యారు. ఆదివారం బీహార్ గవర్నర్ త్రిపాఠీ నితీష్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గోగయ్,బీహార్ మాజీ ముఖ్యమంత్రి మాంఝీ తదితరులు హాజరయ్యారు.

శుక్రవారం గవర్నర్.. నితీష్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. నితీష్ కుమార్ తో పాటు గతంలో ఆయన క్యాబినెట్ లో మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన 22 మంది శాసనసభ్యులు మళ్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, ఆర్జేడీల మద్దతుతో నితీష్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి కారకులైన జతిన్ రామ్ మాంఝీ కూడా హాజరయ్యారు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నితీష్ కుమార్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దీంతో బీహార్ లో రాజకీయ సంక్షోభం ముగియడంతో పాటు జనతా పరివారాన్ని మళ్లీ ఒక్కటి చేయగలిగింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish Kumar  KN Tripathi  swear in ceremony  Bihar CM  

Other Articles