India beat south africa with 130 runs

india beat south africa with 130 runs, india beat south africa in second match, ICC Cricket World Cup 2015, india vs south africa, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, virat kohli, Cricket, CWC 2015, india, india CWC 2015, Live Scores, Live Updates, south africa, siuth africa 2015, Sports, World Cup Live,

shikhar dhawan century helps team india to beat south africa with 130 runs

పౌత్ ఆఫ్రీకాపై గెలుపుతో రికార్డులు తిరగరాసిన టీమిండియా

Posted: 02/22/2015 04:19 PM IST
India beat south africa with 130 runs

ప్రపంచకప్ క్రికెట్ టార్నమెంట్ లో భాగంగా అస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో సపారీలను.. టీమిండియా చిత్తు చేసింది. ప్రపంచ కప్ లో ఇప్పటివరకు భారత్ పై ఓటమి ఎరుగని సౌత్ ఆఫ్రికాలకు ధోణి సేన ఓటమిని రుచి చూపించి రికార్డులను తిరగరాసింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ సఫారీలపై శివమెత్తి ప్రత్యర్థి బౌలర్లను మట్టికరిపించాడు. ధావన్ సెంచరీ చేసిన ప్రతీ మ్యాచ్ లోనూ టీమిండియాను విజయం వరించింది. అదే అనవాయితీ ఇవాళ కూడా కోనసాగింది.

డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన ధోణిసేన అంచనాలను మించి రాణిస్తూ ఆల్ రౌండ్ షోతో అదరగొడుతోంది. టీమిండియా బౌలింగ్ అంత పటిష్టంగా లేదని విమర్శలు ఎదుర్కోంటున్న సమయంలో సఫారీలను చిత్త చేసి తమ సత్తాను చాటారు. ప్రపంచకప్ లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో ధోనీసేన 130 పరుగులతో సఫారీలను చిత్తుగా ఓడించారు. ధవన్ సూపర్ సెంచరీకి తోడు బౌలర్లు సమష్టిగా రాణించి జట్టుకు విజయాన్నందించారు.
 
308 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు 40.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటయ్యారు. అశ్విన్ మూడు, మోహిత్, షమీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా జట్టులో డుప్లెసిస్ (55) టాప్ స్కోరర్. భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ చెల్లాచెదురైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ధోనీసేన నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 307పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ధావన్ (146 బంతుల్లో 16 ఫోర్లు, 2  సిక్సర్లతో 137) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా.. రహానె (60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 79) హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. వన్డేల్లో ధావన్కిది ఏడో సెంచరీ కాగా, సఫారీలపై రెండోది. మరో యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ 46 పరుగులతో రాణించాడు. మోర్కెల్ రెండు వికెట్లు తీశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  india  south africa  

Other Articles