Over 100 000 invites for mulayam s kin s pre wedding ceremony

Tej Pratap Singh wedding, Tej Pratap Singh, Mulayam Singh Yadav grand nephew wedding, Mulayam Singh Yadav grand nephew Tej Pratap Singh wedding, Tej Pratap Raj Laxmi wedding, Lalu Prasad Yadav daughter wedding Lalu Prasad Yadav Raj Laxmi wedding

A staggering 100,000 invites, including to Prime Minister Narendra Modi, have been sent out for Samajwadi Party supremo’s grand nephew’s Saturday pre-wedding ceremony in Saifai village where mouthwatering dishes like bedai, baati-chokha and halwa soaked in desi ghee will be served.

ములాయం మనవడి తిలకం దిద్దడానికే లక్ష అహ్వానాలు..

Posted: 02/19/2015 06:43 PM IST
Over 100 000 invites for mulayam s kin s pre wedding ceremony

రాజు తలచుకుంటే దెబ్బలకు కోదవా అన్న సామెత ఇక్కడ గుర్తుకు రాక తప్పదు. అధికారంలో వున్న పాలకులు తలచుకుంటే జరగనిదేముంది. అందుకు అక్షర సత్యంగా నిలుస్తున్న ఈ ఘటనే నిదర్శనం. ములాయం సింగ్ తెలుసుకదండీ, సమాజ్ వాదీ పార్టీ అద్యక్షుడు. ఆయన మనవడు, ప్రస్తుత యూపీలోని మెయిన్ పూరి పార్లమెంట్ సభ్యుడు అయిన తేజ్ ప్రతాప్ సింగ్ వివాహం బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కనిష్ట పుత్రిక రాజ్ లక్ష్మీతో కుదిరిన విషయం తెలిసిందే. ఈ నెల 26న వారిరువురి పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిపించనున్నారు.

అయితే వివాహ మహోత్సవానికి ముందు ములాయం సింగ్ ఇంటి ఆచారాల ప్రకారం తిలకం దిద్దే కార్యక్రమం ఉంటుంది. ఇందుకు కూడా అతిధులను పిలుస్తారట. కాగా, ఈ నెల 21న జరగనున్న తిలకం దిద్దటానికే లక్ష మంది అతిధులను ములాయం సింగ్ ఆహ్వనించారట. ఉత్తర్ ప్రదేశ్ లోని ఇటావాహ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో వున్న సైఫై గ్రామాంలో జరగనున్న ఈ  కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ సహా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను కూడా ములాయం ఆహ్వానించారట. ఈ కార్యక్రమానికి ప్రధాని వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రధాని భద్రతకు సంబంధించి, ఆయన ప్రత్యేక రక్షణ ధళం సభ్యులు భద్రతా ఏర్పాట్లను చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రధాని హెలికాఫ్టర్ దిగే హెలిఫ్యాడ్ ను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేసినట్లు సమాచారం.

శనివారం సైఫై గ్రామం మునుపెన్నడూ ఎరుగని అతిధులకు ఆహ్వానం పలకనుంది. తిలకం దిద్దే వేడుక నేపత్యంలో వచ్చే అతిధులకోసం బిదాయ్, బాటీ చోఖా, హల్వా వంటి రుచికరమైన వంటకాలను కూడా సిద్దం చేస్తున్నారట. వీరితో పాటు బాలీవుడ్ తారలు, గాయకులు, రాజకీయ ప్రముఖులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు రాష్ట్ర, రాష్ట్రేతర రాజకీయ నేతల రాకతో గ్రామం కోత్త కాంతులీననుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian wedding  Tej Pratap Singh  Mulayam Singh Yadav  

Other Articles