Kcr chiranjeevi and so many people condolences on ramanaidu death

chiranjeevi on ramanaidu death, kcr on ramanaidu death, k.cishwanath at ramanaidu death, ramanaidu, suresh babu, venkatesh

kcr, chiranjeevi and so many people condolences on ramanaidu dead : telangana cm kcr, congress leader,cinema actor chiranjeevi, director k.vishwanath condolences. cm kcr order to the chief secretry to arrangements from govt.

నేల విడిచిన ధృవతార.. రామానాయుడికి ప్రముఖుల నివాళి

Posted: 02/19/2015 01:36 PM IST
Kcr chiranjeevi and so many people condolences on ramanaidu death

ప్రముఖ నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రామానాయుడికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. రామానాయుడు స్టూడియోలోని ఆయన పార్థివ దేహాన్ని సందర్శంచిన కేసీఆర్ అనంతరం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబును ఓదార్చారు. కుటుంబసభ్యులందర్ని ఆయన పలకరించారు.  కేసీఆర్తో పాటు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా రామానాయుడికి అంజలి ఘటించారు. మరోవైపు రామానాయుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. ఈ మధ్యాహ్నం రెండు గంటల వరకు అభిమానుల సందర్శనకు ఉంచి, మూడు గంటలకు అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

రామానాయుడు మృతిపై చిరంజీవి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సినిమానే తన సర్వస్వం అన్నట్లు రామానాయుడు జీవించారని ఆయన అన్నారు. భారతదేశంలోని అన్ని భాషల్లో సినిమాలు తీసి, ప్రపంచంలో ఎవరికీ సాధ్యంకాని పనిని రామానాయుడు సాధించారని చిరంజీవి కితాబిచ్చారు. రామానాయుడు మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని, తనను ఏ నాడు పేరు పెట్టి పిలవలేదని, రాజా అని పిలుస్తుండేవారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

Rama-Naidu-01
Rama-Naidu-010
Rama-Naidu-011
Rama-Naidu-02
Rama-Naidu-03
Rama-Naidu-04
Rama-Naidu-05
Rama-Naidu-06
Rama-Naidu-07
Rama-Naidu-08
Rama-Naidu-09
Rama-Naidu-12
Rama-Naidu-13
Rama-Naidu-14
Rama-Naidu-15
Rama-Naidu-16
Rama-Naidu-17
Rama-Naidu-18
Rama-Naidu-19
Rama-Naidu-20

రామానాయుడు మృతి పట్ల ప్రముఖల సంతాపం తెలుపుతున్నారు. పాతతరం నటీమణులు శారద, కృష్ణకుమారి, కెఆర్ విజయ, షావుకారు జానకి, కె.విశ్వనాథం,  సంతాపం తెలిపారు. అలనాటి నటీమణులు రామానాయుడితో తమ అనుబంధాన్ని, అనుభవాలను గుర్తుచేసుకున్నారు. రామానాయుడుతో అనుబంధం ఇప్పటిది కాదని, కుటుంబపరమైన సన్నిహిత బంధం తమదని ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ తెలిపారు.  రామానాయుడు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద రావు ,మంత్రులు కేఈ కృష్ణమూర్తి, పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీత, శిద్దా రాఘవ రావు, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు తదితరులు సంతాపం తెలిపారు.

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. జగన్, ఎంపీ మురళీ మోహన్ తదితరులు మృతదేహానికి నివాళులు అర్పించారు. రామానాయుడి మృతి పట్ల హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు సంతాపం ప్రకటించారు. రామానాయుడి పార్థినదేహం వద్ద శ్రద్దాంజలి ఘటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  ramanaidu death  suresh babu venkatesh  

Other Articles