Tummala kadiyam not ready to mlc elections contest

kadiyam not ready to mlc elections contest, two ministers tummala, kadiyam uninterseted to contest mlc elections, tummala unintersted in mlc elections, deviprasad, narederreddy, mlc elections, trs, ngo leaders, kadium, Deviprasad narederreddy contest from trs in mlc elections

two ministers tummala nageshwar rao, kadiyam srihari, not representing assembly are not interested in contesting mlc elections

ఈ కోటాలో ఎమ్మెల్సీ.. మాకోద్దు బాబోయ్..!

Posted: 02/19/2015 01:13 PM IST
Tummala kadiyam not ready to mlc elections contest

తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శాసనసభలో ప్రాతినిధ్యం లేని ఇద్దరు మంత్రులు సుముఖత చూపడం లేదు. తెలంగాణలో అధికారిక పార్టీలో వుంటూ తాము ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసి నెగ్గడంపై భావ్యం కాదని, నేరుగా ప్రజలందరి ఓట్లతో నెగ్గి అసెంబ్లీలో అడుగుపెట్టాలని వరు కుతూహలపడుతున్నారు. తెలంగాణ విద్యాశాఖ కడియం శ్రీహరి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టభద్రుల నియోజకవర్గం  నుంచి పోటీ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

మరోవైపు తాము సేఫ్ జోన్ ద్వారా మండలిలో అడుగు పెట్టాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్లమెంటు సభ్యుడి కోసం అహర్నిశలు కష్టపడిన తనకు ఈ సారైనా కొంత రెస్టు అవసరమని కడియం శ్రీహరి భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే తాను గత ఎన్నికలలో కొంత నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో తనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కావాలని తుమ్మల నాగేశ్వర రావు కూడా ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే ఇద్దరు మంత్రులు పట్టబద్రుల ఎన్నికల కోటాలో ఎన్నికకు జంకడానికి మరో కారణం కూడా లేకపోలేదు. మూడు జిల్లాల్లో కలసి లక్షల సంఖ్యలో వుండే ఫట్టభద్రుల కోసం ఊరూరు తిరగడం తమ వల్ల కాదని వారు పార్టీ అధిష్టానానికి తేల్చిచెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా పట్టభద్రుల హామీలను గుప్పించడం కూడా తమకు కష్టంగానే వారు భావిస్తున్నారు.

వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణల నేపధ్యంలో తాటికొండ రాజయ్యపై వేటు పడటంతో ఆయన స్థానంలో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు సీఎం కేసీఆర్. ఆయనతో పాటు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు కూడా మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లో చట్టసభలో అడుగుపెట్టాల్సి ఉంది. దీంతో అందివచ్చిన అవకాశాన్ని ఇరువులు నేతలు వద్దనుకుంటున్నారని సమచారం.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kaciyam srihari  tummala nageshwar rao  mlc elections  

Other Articles