America getting new aircraft for pesident

aircraft. 747-8, 747-200b jumbo.new aircraft for pesident.america, american president , america expend 2286 cr.

america getting new aircraft for pesident. : american president soonly have new aircraft. 747-8 instead of 747-200b jumbo. america expend 2286 cr. on this aircraft.

అమెరికా అధ్యక్షుడికి కొత్త విమానం..ఖర్చు 2,226 కోట్లు

Posted: 02/17/2015 05:43 PM IST
America getting new aircraft for pesident

అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతం వాడుతున్న 747-200 బీ జంబో జెట్‌ స్థానంలో, ఆధునిక బోయింగ్ 747-8 విమానాన్ని తీసుకరావాలని నిర్ణయించారు.  గత 30 ఏళ్లుగా అమెరికా అధ్యక్షుడు 747-200బీ వెర్షన్ విమానాన్ని వాడుతున్నారని, సాంకేతక రంగంలో వచ్చిన మార్పులతో ఆధునీకరించిన కొత్త విమానాన్ని ఎయిర్ ఫోర్స్ వన్ గా తీసుకరావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ దెబోరా లీ జేమ్స్ మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలియజేశారు.

అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరింత పటిష్టంగా తీర్చిదిద్దడంతోపాటు ఇంధనం ట్యాంక్ సామర్థ్యాన్ని కూడా పెంచామని ఆయన చెప్పారు. సకల హంగులు కలిగిన ఈ విమానాన్ని తొలిసారిగా అమెరికాలోనే ఉత్పత్తి చేసినట్టు, దీనికి రూ. 2,286 కోట్లు ఖర్చయినట్టు ఆయన తెలిపారు. అయితే ఈ విమానం దేశాధ్యక్షుడికి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు.

 ప్రస్తుత ఎయిర్ ఫోర్స్ వన్‌లో కూడా సకల సౌకర్యాలు ఉన్నాయి. అధ్యక్షుడితోపాటు ఆయన అంగరక్షకులు, వైట్‌హౌజ్ సిబ్బంది,  వివిధ శాఖలకు చెందిన మంత్రులు, మార్బలం ప్రయాణించేందుకు అవసరమైన వసతులన్నీ ఉన్నాయి. అధ్యక్షుడితోపాటు వైట్‌హౌజ్ సిబ్బంది బస చేయడానికి ప్రత్యేక గదులు, వారు సమావేశమవడానికి ప్రత్యేక హాళ్లు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు ఓ ఆస్పత్రి కూడా ఉంది. ఒకేసారి రెండు వేల మందికి భోజనం తయారు చేయడమే కాకుండా అంతమందికి ఒకేసారి సర్వ్‌చేసే అవకాశం కూడా ఇందులో ఉంది. అంతేకాకుండా బాంబు దాడులే కాకుండా అణ్వస్త్రాలను తట్టుకునే శక్తి కూడా ఈ విమానానికి ఉంది. అణు బాంబుల దాడి సందర్భంగా వెలువడే అణు ధార్మిక తరంగాలను నిలువరించే ప్రత్యేక కవచం కూడా ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే వైట్ హౌజ్ కు రెక్కలు తొడిగితే ఎలా ఉంటుందో ఎయిర్ ఫోర్స్ వన్ అలా ఉంటుంది. గగనతలంలో ఎక్కడ ఉన్నా అమెరికా అధ్యక్షుడు వైట్ హౌజ్ లో ఉన్నట్టుగా విధులు నిర్వహించేందుకు వీలుగా ఇందులో ఏర్పాట్లు ఉంటాయి. ఒక్కసారి ఇంధనం నింపితే సగం ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. గగనతలంలోనే ఇంధనాన్ని నింపుకొనే సౌకర్యం కూడా దీనికి ఉంది. అయినా అమెరికా అనుకుంటే ఇలాంటివి చాలానే చేస్తుంది. అధ్యక్షుడి భద్రత కోసం ఎంతైనా ఖర్చు చేస్తుంది అమెరికా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles