Kalvakuntla kavita nizamabad mp latest interview bjp trs party allliances

kalvakuntla kavita news, nizamabad mp kalvakuntla kavita, kalvakuntla chandrasekhar rao, kavita kcr news, bjp trs party news, kcr narendra modi news, kcr latest news, narendra modi twitter, kavita latest news, kavita interview, mp kavita interview

kalvakuntla kavita nizamabad mp latest interview bjp trs party allliances : nizamabad mp kalvakuntla kavita slams the rumours of alliance between trs and bjp parties.

అవన్నీ ఊహాగానాలే..? కానీ కట్టుబడి వుంటాం..!

Posted: 02/18/2015 10:40 AM IST
Kalvakuntla kavita nizamabad mp latest interview bjp trs party allliances

ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నరేంద్రమోదీతో కలవడం వెనుక కొన్ని ప్రచారాలు జోరుగా సాగాయి. పైగా.. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా మోదీ ట్వీట్ చేయడంపై ఆ ప్రచారాలు మరింతగా బలపడ్డాయి. త్వరలోనే టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య దోస్తీ ఏర్పడే అవకాశాలున్నాయని వార్తలొచ్చాయి. అంతేకాదు.. కేసీఆర్ తన కుటుంబసభ్యులను కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించడం కోసం ఇలా మోదీతో చనువుగా వున్నారంటూ పుకార్లు జోరుగా సాగుతున్నాయి. అయితే.. ఈ విధంగా వస్తున్న వార్తలపై కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత కుండబద్ధలు కొట్టారు.

ఓ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బీజేపీ పార్టీతో టీఆర్ఎస్ దోస్తీ మాటేలేదని ఆమె తేల్చి చెప్పారు. రెండు పార్టీల మధ్య దోస్తీ, కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుందన్న ప్రచారం కేవలం ఊహాగానాలేనని ఆమె కొట్టిపారేశారు. అయితే.. తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ తీసుకునే ప్రతిఒక్క నిర్ణయానికి తాము కట్టుబడి వుంటామని ఆమె ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికోసం సీఎం పాట్లు పాడుతున్నారని, ఇక్కడి ప్రజలకు మేలు చేకూరేలా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె వెల్లడించారు.

అలాగే.. తమ కుటుంబంలో వున్న ఏ ఒక్కరికీ హోదాలపై ఆశలేదని కవిత పేర్కొన్నారు. తెలంగాణ, ప్రజల ప్రయోజనాలు మాత్రమే తమకు ముఖ్యమని ఆమె తెలిపారు. ఇదిలావుండగా.. కేంద్ర కేబినెట్ లో ఈమెకు స్థానం దక్కుతోందన్న వార్తలపై కవిత స్పష్టం చేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mp kalvakuntla kavita interview  narendra modi twitter  kcr news  

Other Articles