Mumbai party central city to get nightlife zones

Mumbai night life, Brihanmumbai Municipal Corporation, Maharashtra CM Devendra Fadnavis, nightlife zones, Bandra Kurla Complex, Carter Road, Marine Drive, Kala Ghoda, Nariman Point.

Mumbai shall soon own the night. The city will soon have eateries, pubs, bars, and entertainment joints open throughout the night in areas designated as 'nightlife zones'.

త్వరలో ముంబాయిలో నిషాచరులకు పండగే..

Posted: 02/17/2015 03:14 PM IST
Mumbai party central city to get nightlife zones

భారత దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో నిషాచరులకు సదావకాశం దక్కనుంది. రాత్రి వేళల్లో బోజనాలు చేయాలనుకునే వారు ఇక దిగులు పడాల్సిన అవసరం లేదు. అంతేకాదండి తెల్లవారితే ఫంక్షన్ కు వెళ్లాలి, గిఫ్ట్ లేదని కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటరా..? ముంబాయిలో ఇక రాత్రి వేళ కూడా షాపింగ్ మాల్స్, బెకరీలు, హోటళ్లు, టీ ష్టాళ్లు తెరచే వుండనున్నాయి. నమ్మకం కలగడం లేదా.. నిజమేనండి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పెడ్నావిస్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో ఈ బిల్లును అసెంబ్లీలో అమోదింపజేసుకునేందుకు చర్యలు చేపట్టింది.

ముంబాయిలోని పలు నివాసేతర ప్రాంతాలకు ప్రత్యేక హాదాను కల్పించి.. అహర్నిశలు అక్కడ వ్యాపారాలు కోనసాగేలా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం ప్రభత్వంలో మిత్రపక్షమైన శిశసేనతో కూడా చర్చలు జరిపింది. శివసేన యూవ విభాగం అధ్యక్షుడు అదిథ్య థాక్రేకు ఈ మేరకు ముఖ్యమంత్రి హామి ఇచ్చినట్లు సమాచారం. హోటళ్లు, మెడికల్ షాపులు, పాల దుకాణాలు, కాఫీ షాపులు, మాల్స్ తదితరాలు పగలు, రాత్రి తెరచి వ్యాపారాలు చేసుకునేందుకు వీలు కల్పించనున్నారు. గతంలొ బ్రహెన్ ముంబాయ్ మున్సిఫల్ కార్పోరేషన్ ఈ ప్రతిపాదనను గత ప్రభుత్వం ముందు పెట్టినా.. అప్పటి ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

నైట్ జోన్ ఏర్పాటుకు ఇప్పటికే ముంబాయిలోని పలు ప్రాంతాలను కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు సమాచారం. నివాసేతర ప్రాంతాలైన కాలా గోడా, నారిమన్ పాయింట్, మెరైన్ డ్రైవ్, బంధ్రాకుర్లా కాంప్లెక్స్, కార్టర్ రోడ్ ప్రాంతాల్లో నైజ్ జోన్ లను ఏర్పాటు చేయనున్నారు. కాగా ఈ నైట్ జోన్ల పరిధిలో రాత్రివేళ్లలో నిర్వహించే వ్యాపార కలాపాలలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తాము పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని ముంబై పోలీస్ కమీషనర్ రాఖేష్ మర్యా తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nightlife  Mumbai  devendra fadnavis  

Other Articles