Lagadapati rajagopal reentry politics vijayawada flexis

lagadapati rajagopal news, lagadapati rajagopal politics, lagadapati rajagopal business, lagadapati rajagopal controversies, ap political news

lagadapati rajagopal reentry politics vijayawada flexis : Lagadapati rajagopal supporters make big banners of him in vijayawada to re enter in politics

రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి మళ్లీ ఎంట్రీ..?

Posted: 02/16/2015 09:11 PM IST
Lagadapati rajagopal reentry politics vijayawada flexis

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన లగడపాటీ రాజగోపాల్.. రాష్ట్రం విడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆనాడు ప్రకటించిన విషయం తెలిసిందే! రాష్ట్ర విభజనను ఆయన ఆపలేకపోయారు కానీ.. తానిచ్చిన మాటప్రకారం రాజకీయం నుంచి తప్పుకున్నారు. అంతే! ఇక అప్పటి నుంచి ఆయన కనిపించడమే లేదు. కేవలం తన వ్యాపారాలపై దృష్టి సారించారు. అయితే.. ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే.. ఈయన మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే.. విజయవాడలో లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి రావాలంటూ భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని మద్దతుదారులు ఇలా బ్యానర్లు, ఫ్లెక్సీలతో తమ అభిమానాన్ని ప్రదర్శించారు. ఆయా ఫ్లెక్సీల్లో ఆయన గురించి ప్రస్తావిస్తూ.. మీలాంటి నీతిపరులు రాజకీయాల్లోకి రావాలంటూ వాటిలో పేర్కొన్నారు. ఇలా ఫ్లెక్సీలు పెట్టడంతో లగడపాటి పునరాగమనంపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. మరి.. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా..? లేదా..? అన్న ప్రశ్నకు ఆయన తప్ప మరెవ్వరూ సమాధానం ఇవ్వలేరు!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lagadapati rajagopal news  andhra pradesh politics  pepper spray  

Other Articles