Congress party arunachal pradesh liromoba assembly constituency elections nyamar karbak

congress party news, arunachal pradesh assembly elections, arunachal pradesh liromoba, arunachal pradesh assembly elections, congress party elections, delhi elections, Nyamar Karbak, BJP rival Bai Gadi, liromoba Assembly constituency

congress party arunachal pradesh liromoba Assembly constituency elections Nyamar Karbak : The Congress party has retained the Liromoba Assembly constituency in Arunachal Pradesh, counting for which was held on Monday, with the party’s nominee Nyamar Karbak defeating his nearest BJP rival Bai Gadi by a margin of 119 votes in a five-cornered contest. While Karbak polled 3808 votes, Gadi polled 3689.

హమ్మయ్యా.. ఎట్టకేలకు ‘కాంగ్రెస్’ విజయం సాధించింది!

Posted: 02/16/2015 06:46 PM IST
Congress party arunachal pradesh liromoba assembly constituency elections nyamar karbak

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా ఓడిపోయిందో అందరికీ తెలిసిందే! 127 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హస్తాన్ని కమలం తన పరిమళంతో దాని జాడలేకుండా చేసేసింది. ఇక కాంగ్రెస్ కి దారిలేక చేతులు ముడుచుకుని ఓ మూలాన పడిపోయింది. ఇక ఇటీవలే ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనైనా కాస్త తేరుకుంటుందని అంతా భావిస్తే.. మఫ్లర్ మేన్ తన చీపురుతో అటు కమలాన్ని, ఇటు హస్తాన్ని ఊడ్చేశాడు. కమలం కాస్త ఫర్వాలేదనుకుంటే.. కాంగ్రెస్ చేతిలో గుడ్డు మిగిలింది. ఈ దెబ్బతో కాంగ్రెస్ ఢిల్లీ దరిదాపుల్లో కనిపించలేదు. ఇంత దారుణమైన పరిస్థితిలో వున్న ఈ కాంగ్రెస్ కు దేశానికి ఓ మూలాన కాస్త ఊరట లభించింది.

అరుణాచల్ ప్రదేశ్ లోని లిరోమొబా అసెంబ్రీ నియోజకవర్గానికి చెందిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో పోటీకి నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థి న్యామర్ కార్బాక్ తన సమీప బీజేపీ పార్టీ ప్రత్యర్థిపై కేవలం 119 ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. ఈ ఎన్నికల వివరాలను అధికారి డీజే భట్టాచార్య తెలియజేసిన వివరాల ప్రకారం.. కార్బాక్ కు 3,808 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి బైగాడికి 3,689 ఓట్లు వచ్చాయి. మరో 9మంది నోటా (నన్ ఆఫ్ ది అబవ్) బటన్ నొక్కారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేవలం ఈ ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది. అయితే.. ఈ విజయం కాంగ్రెస్ కి ఏమాత్రం లాభం చేకూర్చదు. అంటే.. గెలిచి కూడా వేస్టేనన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress party news  arunachal pradesh assembly elections  

Other Articles