High court announce judgement on chest hospital

high court, chest hospital, secretariate, kcr , ts govt

high court announce judgement on chest hospital : on the pill of chest hospital move to vikarabad court judge that it dont interfear in that mattar. if the appilate want to suggest any thing then suggest the govt.

ఛెస్ట్ ఆస్పత్రి తరలింపుపై జోక్యం చేసుకోమన్న హైకోర్టు

Posted: 02/16/2015 03:49 PM IST
High court announce judgement on chest hospital

ఎర్రగడ్డలో ఉన్న ఛెస్ట్ ఆస్పత్రి తరలింపు పై జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆస్పత్రి తరలింపు చట్టవ్యతిరేకం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై  విచారణ జరిపిన కోర్టు ఆస్పత్రి తరలింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడుకోవాలని పిటిషనర్లకు సూచించింది. ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చుకోవచ్చని తెలిపింది.

ఛెస్ట్ ఆస్పత్రిని తరలించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని, 2008లో నిర్ణయించిన విధంగా ఎర్రగడ్డలో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన బక్కా జెడ్సన్ వేర్వేరుగా ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారు. అయితే నాగం జనార్దన్ రెడ్డి హైకోర్ట్ అయిపోతే సుప్రీంకోర్టుకు వెళతాం అంటూ వ్యాఖ్యానించారు. కెసిఆర్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఛెస్ట్ ఆస్పత్రి విషయంలో సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : high court  chest hospital  secretariate  kcr  ts govt  

Other Articles