Bjp trying to collabarate with ncp

sharadpawar, modi, ncp, maharastra, shivasena, uddavthakre

bjp trying to collabarate with ncp: pm modi announce that sharadpawar is his best friend and he helped him very much when he was as gujarat cm. bjp, shivasensa clashes going on. so pm modi try to get the support of ncp in maharashtra.

కొత్త పొత్తు పొడుస్తోందా!...భాజపాతో ఎన్సీపీ జట్టు..?

Posted: 02/16/2015 01:39 PM IST
Bjp trying to collabarate with ncp

భాజపాతో శివసేనకు పెరుగుతున్న దూరం మరింత పెరుగుతోంది. అయితే రాజకీయాల్లో ఎవరూ శాశ్వత శత్రువులు కారు, శాశ్వత మిత్రులు కారు అనేది ఓ నానుడి. తాజా రాజకీయ పరిణాములు ఇదే విషయాన్ని తెలుపుతున్నాయి. శివసేన ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై చేసిన ప్రకటనలు, బీహార్ రాజకీయాలపై ఉద్దవ్ థాక్రే తాజాగా చేసిన ారోపణుల కొత్త పొత్తుకు దారులు వేస్తున్నాయా అన్న సందేహం కలుగుతోంది. బీహార్ సిఎం మాంఝీకు భాజపా మద్దతు పలకడంపై శివసేన మండిపడింది. భాజపా కొత్తగా రాజకీయాల్లో చీకటి దశాబ్దానికి తెర తీసిందని ఉద్దవ్ ప్రకటన చాలా సంచలనం కలిగిస్తోంది. అయితే మరో వైపు మహారాష్ట్రలో ఎన్సీపి అధ్యక్షుడు శరద్ పవార్ తో మోదీ సన్నిహితంగా మెలుగుతున్నారు. శరద్ పవార్ కూతురి కార్యక్రమానికి హాజరైన మోదీ అతన్ని ఆకాశానికి ఎత్తేశారు. రైతుల పట్ల ఎంతో దూర దృష్టి ఉన్న నేత పవార్ అని, తన సలహాలు సూచనలను తాను పాటిస్తుంటానని మోదీ చేసిన ప్రకటన పరోక్షంగా కొత్త పొత్తుకు సంకేతంగా భావిస్తున్నారు.

అయితే మోదీ మాటలు పవార్ తో కొత్త పొత్తుకు ఎంత వరకు సహకరిస్తాయన్నది ప్రశ్న. యుపిఎ ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరించిన పవార్ ఇప్పుడు భాజపాకు ఎలా మద్దతు ఇస్తారో చూడాలి. కాగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు సమయం నుండి శివసేనకు, భాజపాకు అభిప్రాయ భేదాలున్నాయి. శివసేన మాటలు రెండు పార్టీల మధ్య మరింత దూరాన్ని పెంచుతున్నాయి. మోదీ వ్యూహంలో భాగంగానే పవార్ తో చెట్టాపట్టాలేస్తున్నారని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఎన్సీపీతో భాజాపా పొత్తు పొడుస్తుందో లేదా మాటల వరకే పరిమితమవుతుందో వేచి చూడాలి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sharadpawar  modi  ncp  maharastra  shivasena  uddavthakre  

Other Articles