Tdp contestent won in thirupathi byelections

thirupathi elections, by polls, sugunamma

tdp contestent won in thirupathi byelections: in thirupathi byelections tdp contestent sugunamma won. she won the elections by 1 lakh majority by congress candidate.

తిరుపతిలో టిడిపి గెలుపు..సుగుణమ్మకు భారీ మెజారిటీ

Posted: 02/16/2015 12:41 PM IST
Tdp contestent won in thirupathi byelections


తిరుపతి ఎన్నికల్లో సెంటిమెంట్ పండింది. తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని మరో సారి టిడిపి కైవసం చేసుకుంది. తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో టిడిపి అభ్యర్థి సుగుణమ్మ సమీప ప్రత్యర్థి శ్రీదేవిపై 1,16, 524 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. టీడిపి నేత వెంకటరమణ మృతి చెందడంతో ఈ ఉపఎన్నికలు జరిగాయి.  అయితే ఎన్నికలకు వెళ్లకుండా సుగుణమ్మను ఏకగ్రీవం చెయ్యాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ తోసిపుచ్చింది. దాంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. అయితే ఎన్నికల్లో తిరుపతి ప్రజలు పెద్దగా పాల్గొనలేదు. ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. అయినా వెంకటరమణ భార్య సుగుణమ్మకే తిరుపతి ప్రజలు పట్టంకట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవికి 9,628 ఓట్లు, లోక్ సత్తా పార్టీ అభ్యర్థికి 3,819 , ఇండిపెంపెంట్ అభ్యర్థికి 3,156 ఓట్లు పడ్డాయి. తిరుపతి ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని సుగుణమ్మ ప్రకటించారు. అత్యధిక మెజార్టీ అందించిన తిరుపతి ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి ప్రజల సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : thirupathi elections  by polls  sugunamma  

Other Articles