Clashes between ap and ts

kcr, babu, ap and ts, clashes, fee reumbersment, ppa problem, irrigation water, sagar war,

clashes between andhrapradesh and telangana : ap and ts have many internal problems. the two states cms are not consentrating on their states development.

ప్రత్యేకం: ఇద్దరు చంద్రులు కానీ..వేడి తగ్గడం లేదు

Posted: 02/14/2015 04:42 PM IST
Clashes between ap and ts

తెలుగు రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడింది. నిన్నటి దాకా తప్పు కానిది ఇప్పుడు మాత్రం తప్పుగా కనిపిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలు రోజురోజుకు మరింత జఠిలమవుతున్నాయి. నీరు, విద్యుత్ లు రెండు రాష్ట్రాలకు ఎంతో అవసరం. కానీ అసలు వివాదం ఇక్కడే మొదలైంది. తెలంగాణ నేతలైతే అసలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఈ రెండింటి కోసమే ప్రారంభమైందని అంటున్నారు. నాగార్జున సాగర్ వివాదం చిలిచిలికి గాలి వానగా మారింది. పరిస్థితి మరింత చేయి దాటక ముందే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు చర్యలకు దిగాలి. అయితే రెండు రాష్ట్రాల వివాదం ఇక ముగిసింది అనుకుంటే అది పొరపాటే..ఎందుకంటే అసలు వివాదాలు ముందు ముందు ఇంకా వస్తాయన్నది అక్షరసత్యం.  అందుకే మేధావులు కొందరు రాష్ట్ర విభజన తీరు ఇది కాదు అంటూ మండిపడ్డా ఎవ్వరూ లెక్కచెయ్యడం లేదు. ఇప్పుడు ఆ ఫలితాలను అనుభవిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కెసిఆర్ గారు మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తరువాత తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్ మెంట్ అంటూ ప్రకటన చేసి పెద్ద వివాదానికి కేంద్ర బిందువయ్యారు.  ముందు తండ్రి స్థానికత ఆధారంగా అని, ఆ తర్వాత 1956కు ముందు తెలంగాణలో ఉండే స్థానికులకే ఫీజు రియంబర్స్ మెంట్ అంటూ రెండు విధాలుగా ప్రకటనలు చేయటంతో గందరగోళం ఏర్పడింది. 1956కు ముందు ఉన్న వారినే స్థానికులుగా గుర్తిస్తామన్న అంశంపై న్యాయపోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో పదేళ్లపాటు ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఉమ్మడిగా నిర్వహించాల్సి ఉంటుంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ఉన్న ప్రధాన సమస్యల్లో నీటి పంపకం ఒకటి. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యను రెండు రాష్ట్రాలు సాగదీస్తున్నాయి. రెండు రాష్ట్రాలు పంతాలు, పట్టుదలకు పోతున్నాయి. కృష్ణా డెల్టాకు తాగు నీరు అందించేందుకు 10 టిఎంసీల నీటిని విడుదల చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలకు మొదట్లో తెలంగాణ సర్కార్ వ్యతిరేకించింది. డెల్టా తాగునీటి అవసరాలకు 10 టీఎంసీల నీరు అవసరం లేదని తెలంగాణ సర్కారు వాదన. తాగు నీటి అవసరాలకు 2 టిఎంసిల నీరు సరిపోతుందని, సాగునీటికి మళ్లించేందుకే ఆంధ్ర సర్కార్ పది టిఎంసిల నీరు డిమాండ్ చేస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది .ఇక పోలవరం సమస్య మరో వివాదానికి కారణం.

నీటి కోసం జరుగుతున్న జగడాలు చాలవన్నట్లు కరెంట్ కష్టాలు కూడా. పీపీఏలు రద్దు చేసుకునే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది.  దాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నవిద్యుత్ ఆ రాష్ట్రానికే దక్కాలని చంద్రబాబు సర్కారు భావన. అదే వాదనతో ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న విద్యుత్ పీపీఏలను ఉపసంహరించుకోవాలనే ప్రయత్నం చేసింది. విశాఖ లోని హిందూజా పవర్ ప్రాజెక్ట్ నుంచి కూడా తమకు వాటా ఇవ్వాల్సిందేనంటూ తెలంగాణ సర్కార్ పట్టుబడుతోంది.  రెండు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న హిందుజా ప్రాజెక్టుకు చెందిన 520 మెగావాట్ల విద్యుత్ కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. తమ ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్ అంతా డిస్కం లకు ఇవ్వడానికి గతంలో హిందూజా యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం అయినందున ఆ ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ పై తమకు కూడా వాటా ఇవ్వాలంటోంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు తెలంగాణకు విద్యుత్ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ససేమిరా అంటోంది.  హిందూజా పవర్ ప్రాజెక్ట్ ఒప్పందానికి ఈఆర్సి ఆమోదం లేదని ఇలాంటి పీపీఏలను ఉపసంహరించుకున్నట్లు ఈఆర్ సి కి తెలియజేశామంటోంది ఏపీ సర్కార్.  

ఇలా రెండు రాష్ట్రాల మధ్య  రోజుకో వివాదం తెర మీదకు వస్తోంది. అయితే కొత్తగా ఏర్పడి రాష్ట్రాలు రాష్ట్ర ప్రగతి మీద దృష్టి సారించడం రెండింటికి మంచిది కాదు. ఒక వైపు మోదీ అన్ని రాష్ట్రాలకు అభివృద్ధి చెందే అవకాశాలను పెంచుతామని ప్రకటించారు. అయినా మన వాళ్లు ఇంకా సమస్యలపైనే పోరాడుతున్నారు. ఉద్యమం ప్రభావం రెండు రాష్ట్రాల మీద ఇంకా ఉంది అన్నది స్పష్టం. నాగార్జున సాగర్ వద్ద అధికారుల వాగ్వాదం, పోలుసులు ఒకరిపై మరొకరు లాఠీ చార్జ్ చేసుకోవడం లాంటి ఘటనలు దీనికి అద్దం పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు చంద్రులు ఉన్నా...ఇంకా వేడి మాత్రం చల్లారడం లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాలను అభివృద్ధి వైపు పరుగులు తీయిస్తారని ఆశిద్దాం.
 - అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  babu  ap and ts  clashes  fee reumbersment  ppa problem  irrigation water  sagar war  

Other Articles