Arvind kejriwal excellent speech in delhi ramleela ground

arvind kejriwal oath, speech in ramleela ground, aap leaders,

arvind kejriwal excellent speech in delhi ramleela ground. : aap leaders and kejriwal followers attend the oath programme of kejriwal.

అదిరిందయ్యా కేజ్రీవాల్.. ప్రమాణం, ప్రసంగం రెండూ హిట్టే

Posted: 02/14/2015 03:54 PM IST
Arvind kejriwal excellent speech in delhi ramleela ground

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం తరువాత రామ్ లీలా మైదానంలో కేజ్రివాల్ చేసిన ప్రసంగం, అందరినీ ఆకట్టుకుంది. ఎన్నికల్లోనూ ఇంతలా ఎన్నడూ మాట్లాడని కేజ్రీ నిజంగా కేక పెట్టించాడు. ఓ ముఖ్యమంత్రిగా తాను చెయ్యాలనుకున్న ప్రతి విషయాన్ని పూసగుచ్చారు. మధ్యలో మీడియాకు చురకలు వేశారు. మాకు ఓటు వేశారా లేదా అనే దాంతో ప్రమేయం లేకుండా .. మా ప్రభుత్వం అందరిదీ.  నేను ఒక్కడినే కాదు ఢిల్లీలోని ప్రతి పౌరుడూ  ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినట్టే అన్న మాటలకు రామ్ లీలా మైదానం చప్పట్లతో ఊగిపోయింది. భారతదేశంలో మొట్టమొదటి అవినీతి రహిత నగరంగా ఢిల్లీని తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా అయన ప్రకటించారు.  ఆసుపత్రులు, రోడ్లు నిర్మిస్తాం. మహిళలకు భద్రత ఉండేలా ఢిల్లీని తయారుచేస్తామని అన్నారు.

అదే సమయంలో ప్రజలు పన్నులు చెల్లించాలని, అలా చెల్లించిన డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా వృధాగా పోదని గర్వంగా చెప్పారు. తప్ప చేసిన వాళ్లు ఏ టోపి పెట్టుకున్నా వాళ్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యగానే మీడియా వారు ఎప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తారని అడుగుతారని, కానీ మిగిలిన పార్టీల ప్రభుత్వాలు ఎంత తొందరగా చేస్తాయో అంతకన్నా చాలా తొందరగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ప్రభుత్వం అన్నాక కొన్ని  ఇబ్బందులు ఉంటాయని తెలిపారు. రెడ్ కార్పెట్, వీఐపీ సంస్కృతులను మారుస్తామన్నారు. చాలా  దేశాల్లో ప్రధానమంత్రులు బస్ స్టాప్ లలో వేచి ఉంటారని అన్నారు. కిరణబేడీ నా  సోదరిలాంటివారు. అజయ్ మాకెన్ ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నేత. వారిద్దరి సూచనలు, సలహాలు తప్పక స్వీకరిస్తామన్నారు. తొందరలోనే  జనలోక్ పాల్  బిల్లును తీసుకొస్తామన్నారు.  చివర్లో ఇండియా ప్రపంచ కప్  గెలుచుకోవాలని, టీమిండియా సభ్యులకు అభినందనలు అన్నారు. చివర్లో తన గొంతు బాగా లేదంటూనే...  ఇన్ సాన్ కా ఇన్ సాన్  హై... అని పాడుతుంటే అభిమానులంతా ఆయనతోపాటు గొంతుకలిపారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ సీఎం కేజ్రీవాల్ తన  ప్రసంగాన్ని ముగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arvind kejriwal oath  speech in ramleela ground  aap leaders  

Other Articles