New zealand vs srilanka match world cup 2015

new zealand vs srilanka, world cup 2015 matches, new zealand cricket team, new zealand won world cup, new zealand world cup 2015, srilanka world cup 2015

new zealand vs srilanka match world cup 2015 : New zealand cricket team won tha first match of icc world cup 2015 agaist srilanka

‘లంకె’త్తిన న్యూజిలాండ్ ఆటగాళ్లు..

Posted: 02/14/2015 12:48 PM IST
New zealand vs srilanka match world cup 2015

ఫిబ్రవరి 14వ తేదీనుంచి ప్రారంభమైన ప్రపంచకప్ సమరంలో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్’లో న్యూజిలాండ్ ఆటగాళ్లు ‘లంకె’త్తారు. న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లో జరిగిన ఈ తొలి మ్యాచ్ లో శ్రీలంకపై జట్టుపై న్యూజిలాంట్ 98 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయం సాధించింది. ఇరుజట్లలో ప్రతిభావంతులైన ఆటగాళ్లు వున్నప్పటికీ.. న్యూజిలాండ్ ముందు లంక జట్టు నిలబడలేకపోయింది.

ఈ తొలిమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 331 పరుగులు చేసింది. అండర్సన్ (75), మెక్ కల్లమ్ (65), విలియమ్సన్ (57) వంటి ఆటగాళ్లు ధాటిగా ఆడటంతో ఇంత భారీ స్కోరును చేయగలిగారు. మిగతా ఆటగాళ్లు కూడా బాగానే ప్రదర్శించారు. దీంతో ఈ జట్టు 6 వికెట్లు కోల్పోయి 331 స్కోరును చేసింది. ఇక 332 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక.. ఓపెనర్ తిరుమన్నే (65) మినహా ఎవరు సరిగ్గా ఆడలేకపోయారు.

దిల్షాన్ (24), సంగక్కర (39), జయవర్దనే (0) కీలకసమయాల్లో ఔట్ కావడం వల్ల జట్టుపై ఒత్తిడి పెరిగింది. మాథ్యూస్ (46) ప్రత్యర్థి బౌలర్లపై విరుచుపడ్డాడు కానీ ఫలితం లేకపోయింది. దీంతో లంక జట్టు 98 పరుగుల వ్యత్యాసంతో పరాజయం పాలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles