Rape in bjp office

rape in bjp office, westbengal updates, rape on five year girl, westbengal news, west bengal bjp

rape in bjp office : in west begal a person attempt rape in bjp office. trunamul congress and bjp oppose that. bjp announce that that person is a shoper son which is beside the bjp office.

పార్టీ ఆఫీసులో చిన్నారిపై అత్యాచారం..!

Posted: 02/14/2015 12:14 PM IST
Rape in bjp office

కోల్ కత్తాలోని  బీజేపీ కార్యాలయంలోనే దారుణం జరిగింది.  బెహలాలోని మండల బీజేపీ ఆఫీసులో అయిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.  తమ పాప కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు  పార్టీ ఆఫీసు తలుపు తట్టారు. దీంతో ఆ  యువకుడు అక్కడ నుంచి పరారయ్యాడు.  లోపల రక్తస్రావంతో బాధపడుతున్న బాలికను గమనించిన స్థానికులు, భాజపా కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు.  ఘటనను సంబందించి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు.దాంతో వారు కేసు నమోదు చేశారు.  పోలీసులు  బాలికను హాస్పిటల్  తరలించి చికిత్స అందిస్తున్నారు.  అత్యాచారం జరిగినట్టుగా వైద్యులు ధ్రువీకరించినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ రషీద్  మునీర్ ఖాన్ తెలిపారు.

మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బీజేపీ అధికార ప్రతినిధి ఈ  సంఘటన దురదృష్టకరమని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా  బీజేపీ ఆఫీసు పక్కనే ఉండే ఒక షాపులో కార్యాలయం తాళాలు ఉంటాయని, నిందితుడు షాపు యజమాని కొడుకని  పోలీసులు తెలిపారు.  నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే అసలే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం భాజాపాకు అంత మంచిది కాదు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి భాజపాపై దాడి చెయ్యడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. మరి ఇలాంటి ఘటనలు మమత బలాన్ని మరింత పెంచే అవకాశాన్ని కల్పిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles