Kejriwals 7 member cabinet

aap cabinet, delhi cabinet, aravind kejriwal cabinet, no women in kejriwal cabinet, telangana government, Janlokpal Bill, Arvind Kejriwal, Aam Aadmi Party, Delhi Police, DDA, Lokpal and Lokayukta Act and NCT Act 1991, Ministry of Home Affairs

kejriwal walking in the lines of KCR, not including any women legislatures in cabinet

కేసీఆర్ బాటలో పయనిస్తున్న కేజ్రీవాల్..!

Posted: 02/13/2015 05:16 PM IST
Kejriwals 7 member cabinet

ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు బాటలో పయనిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ధేశించన మార్గంలోనే ఆయన పయనిస్తున్నారు. అదేంటి ఇద్దరి మధ్య అంత చనువు లేదుగా అనుకుంటున్నారా..? అదేంలేదండి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ లో ఒక్కరు కూడా మహిళా మంత్రలు లేరు. ఇప్పుడ అరవింద్ కేజ్రీవాల్ కూడా తన మంత్రిమండలిలో మహిళా శాషనసభ్యులకు స్థానం కల్పించలేదు. కొత్త కేబినెట్‌ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న ఆయన ముందస్తుగా. ఏడుగురు మంత్రులతో రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముందునుంచి వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో.. అనుకున్నట్లుగానే ఆప్ ముఖ్యనేత మనీష్ సిసోడియాకు ఉప ముఖ్యమంత్రి బెర్తు దాదాపు ఖరారు అయింది. ముగ్గురు పాత మంత్రులకు మళ్లీ క్యాబినెట్ లో స్థానం దక్కగా, మిగిలిన నాలుగురుని కొత్తవారినే ఎంపిక చేశారు కేజ్రీవాల్.
 
ఈ జాబితాను శుక్రవారం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు నివేదించినట్టు పార్టీ వర్గాల సమాచారం. సత్యేంద్ర జైన్, అసిఫ్ అహ్మద్, సందీప్ కుమార్లకు కేజ్రీవాల్ టీంలో చోటు లభించింది. కాగా గత కేబినెట్లో మంత్రులుగా ఉన్న సోమ్నాథ్ భారతీ, రాఖీ బిర్లా, సౌరభ్ భరద్వాజ్, గిరీశ్ సోనీలకు ఈసారి చోటు దక్కలేదు. రామ్ నివాస్ గోయల్, బందన కుమారి ఇద్దరూ.. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను ఆశిస్తున్నట్టు సమాచారం. కాగా ఆప్ నుంచి ఆరుగురు మహిళలు విజయం సాధించిన విషయం తెలిసిందే. గత వారంలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67  స్థానాల్లో గెలిచి రికార్డు విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janlokpal Bill  Arvind Kejriwal  Aam Aadmi Party  

Other Articles