Telangana and ap are fighting for nagarjuna sagar

nagarjunasagar, ap irrigation, ts on sager water, irrigation under nagarjunasagar, clashes at nagarjunasagar, ts and ap

telangana and ap are fighting for nagarjuna sagar : ap and ts officials are fighting for nagarjunasagar water. ap officials tried to release water telangana officials stop that. police provide protection at sagar.

సాగర్ పై వివాదం..రెండు రాష్ట్రాల అధికారుల వాగ్వాదం

Posted: 02/13/2015 06:11 PM IST
Telangana and ap are fighting for nagarjuna sagar

నాగార్జున సాగర్ జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య వివాదం మరింత జఠిలంగా మారింది. సాగర్ పై రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు సాగర్ పై మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే కృష్ణా నది జలాలపై వివాదాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలే చర్చించుకొని, పరిష్కరించుకోవాలని కొన్ని రోజుల క్రితం కృష్ణా జలాల నీటి యాజమాన్య బోర్డ్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉత్తరాలు రాసింది. చర్చల సారాంశాన్ని తనకు పంపాలని లేఖలో కోరింది. కానీ రెండు రాష్ట్రాలకు చర్చలకు రాలేదు. నాగార్జున సాగర్ నుండి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసేందుకు ఏపి నీటిపారుదల అధికారులు ప్రయత్నించారు. దాన్ని తెలంగాణకు చెందిన ఇంజనీర్లు అడ్డుకున్నారు. దాంతో వివాదానికి తలెత్తింది. రెండు రాష్ట్కరాల అధికారులు వాగ్వాదానికి దిగడంతో సాగర్ వద్దకు పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం సాగర్ వద్ద గట్టి పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. అయితే రెండు రాష్ట్రాలు వివాదాన్ని పరిష్కరించేలా చర్చలు మాత్రం జరపడం లేదు.

అధికారల కన్నా రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులు చేసిన వ్యాఖ్యలు సాగర్ సమస్యను మరింత పెంచాయి. రెండు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖ అధికారులు, తమ రాష్ట్రమే రైట్ అంటూ వాదిస్తున్నారు. ఇక పై ఆంధ్రప్రదేశ్ కు ఒక్క బొట్టు నీటిని కూడా వదిలేది లేదని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావ్ కుండబద్దలు కొట్టారు. అయితే సాగర్ జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కుందని, రెండు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేతలు. న్యాయంగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన వాటాను విడుదల  చెయ్యాలని కోరుతున్నట్లు ఏపి నేతలు వాదిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles