Doctors treat a dead body

doctors treat, fake treatment, corporate hosital cheating

in hyderabad, a hospital doctors gave treatment to the dead body. those patient relative commence to dharna.

చనిపోయిన వ్యక్తికి ట్రీట్ మెంట్....?

Posted: 02/13/2015 09:38 AM IST
Doctors treat a dead body

మెగాస్టార్ నటించిన ఠాగూర్ సినిమాలో చనిపోయిన ఓ వ్యక్తికి ట్రీట్ మెంట్ అంటూ కొందరు డాక్టర్లు లక్షల ఫీజును లాగుతుంటారు. తర్వాత చిరంజీవి వాళ్లకు బుద్ది చెబుతాడు. ఇదంతా సినిమా కానీ ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. తమ వద్ద నుండి మూడు లక్షలు వసూల్ చేశారు, కానీ ఇప్పటి వరకు పేషంట్ ను మాత్రం చూపలేదు అంటూ పేషంట్ తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రాజశేఖర్ కు మూడు రోజుల క్రితం గచ్చిబౌలి వద్ద యాక్సిడెంట్ జరిగింది. దాంతో వారు అతన్ని ఎల్బీనగర్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటి నుండి ఐసియులోనే ఉంచిన డాక్టర్లు చికిత్స నిర్వహిస్తున్నారు. అయితే అతన్ని చూడడానికి మాత్రం ఎవరినీ అనుమతించలేదు. తరువాత డాక్టర్లు పేషఎంట్ బిల్ కట్టాలంటూ రాజశేఖర్ బంధువులకు చెప్పారు. అయితే పేషంట్ ను చూస్తే కానీ బిల్ కట్టమంటూ వారు భీష్మించుకు కూర్చున్నారు. కానీ అంతకు ముందే అతను మరణించినట్లు వారు ఆరోపిస్తున్నారు. దాంతో వారు ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : doctors treat  fake treatment  corporate hosital cheating  

Other Articles