తన కొడుకును చూద్దామని వెళ్లిన ఓ భారతీయుడిపై అమెరికా పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు. సురేష్ భాయ్ పటేల్ అనే వ్యక్తి మూడు వారాల క్రితం తన కొడుకును చూడడానికి అమెరికాకు వెళ్లాడు. తన కొడుకు ఉంటున్న ఇంటి ముందు వాకింగ్ చేస్తున్న పటేల్ ను పెట్రోలింగ్ పోలీసులు అడ్డగించారు. అయితే అప్పటికే ఎవరో వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నారని పోలీసులకు ఫోన్ రావడంతో పటేల్ ను అనుమానించారు. ఇంగ్లీష్ అంతంమాత్రం వచ్చిన పటేల్, పోలీసులకు తన కొడుకు ఇంటి నెంబర్ తో సహా వివరాలు తెలిపాడు. అయినా పోలీసులు వినిపించుకోకుండా అతన్ని చితకబాదారు. దాంతో తీవ్రగాయాలపాలైన పటేల్ ఆస్పత్రిలో చేరారు. పోలీసుల దెబ్బలతో పటేల్ శరీరం చచ్చుబడింది.
ఈ మొత్తం వ్యవహారంపై స్థానిక పోలీసు అధికారులు ఇప్పుడు స్పందించారు. ఘటనకు బాధ్యులైన పోలీసులపై సస్సెన్షన్ విధించామని ప్రకటించారు. అయితే ఈ ఘటన అనుకోకుండా జరిగింది మాత్రమే అని వివరణ ఇచ్చుకున్నారు. పటేల్ ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని ఆశిస్తున్నట్లు ప్రకటించారు. పోలీసుల దాష్టీకంపై అక్కడ తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. మానవ హక్కులకు ఎంతో విలువ నిచ్చే అమెరికా లాంటి దేశంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఏంటని మానవ హక్కుల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవ హక్కులపై అమెరికా దేశాధ్యక్షులు అన్ని దేశాలకు హితువులు పలుకుతారని, కానీ స్వదేశంలో మాత్రం వాటి అములును పట్టించుకోవడం లేదని వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థలు మండిపడ్డాయి. అయితే అమెరికాలో విదేశస్తుల సంఖ్య భారీగా ఉంటుంది. అక్కడి నల్లవారిపై తరుచూ దాడులు జరుగుతున్నా, ప్రభుత్వ చర్యలు మాత్రం సంతృప్తికరంగా లేవు.
భారతదేశం గురించి ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తామని చెప్పుకునే అమెరికా, ఇలాంటి ఘటనలపై స్పందించాల్సిన అవసరం ఉంది. పోలీసులు కావాలని చెయ్యలేదని ప్రకటించడం వివాదాస్పదమైంది. పోలీసులకు అన్ని వివరాలను పూర్తిగా చెప్పినా, దాడికి పాల్పడటం జాత్యహంకారమే అంటున్నారు కొందరు సామాజిక కార్యకర్తలు. అయితే కొంత మంది సామాజిక కార్యకర్తలు చట్టాల్లో మార్పులు రావాలని డిమాండ్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more