Modi looking very disappointing

modi, modi in governors meeting, modi with governers, delhi elecyions effect, aap effect

modi looking very disappointing : in governers conference modi looking very disappointed. in the delhi elections bjp lost cruelly.

ఆప్ దెబ్బకు చిన్నబోయిన మోది మొహం

Posted: 02/12/2015 01:06 PM IST
Modi looking very disappointing

అందరిని పలకరిస్తు, హడావిడి చేసే మోది, ఢిల్లీలో జరిగిన గవర్నర్ ల సదస్సులో మాత్రం  ముభావంగా కనిపించారు. ఎప్పుడూ ఎంతో చలాకిగా, హుందాగా కనిపించే మోది మొహం కళ తప్పింది. ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలుకావడంతో మోది కలత చెందినట్లు సమాచారం. సదస్సులో ఉన్నంత సేపు విచార వదనంతో ఉన్న ఆయన, కనీసం ప్రసంగం కూడా చెయ్యలేదు. ఎప్పుడూ రెండు మూడు కార్యక్రమాలతో బిజీగా ఉండే ప్రధాని నిన్న మాత్రం గవర్నర్ సదస్సుకు మాత్రమే పరిమితమయ్యారు. మొత్తానికి ఆప్ ఫలితాల ప్రభావం మోది మొహంలో కొట్టొచ్చినట్టు కనిపించాయని కొందరు గవర్నర్లు కూడా గుసగుసలాడినట్లు సమాచారం.

ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం అటు బిజెపి అధ్యక్షులు అమిత్ షా కుమారుని పెళ్లి లోనూ కనిపించింది. పెళ్లికి ఒక్క నేత కూడా హాజరుకాకపోవడం చూస్తుంటేనే ఢిల్లీ ఫలితాలు బిజెపిని ఎంతలా దెబ్బతీశాయో తెలుస్తోంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించిన మోది, రానున్న బీహార్ ఎన్నికలపై దృష్టి సారించాలని అన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  modi in governors meeting  modi with governers  delhi elecyions effect  aap effect  

Other Articles