Patna high court stays nitish kumar s election as jdu legislature party chief

Patna High Court stays Nitish Kumar's election, Bihar political crisis, nitish kumar, prime minister, union home minister, Rajnath singh, narendra modi, bihar, bjp, jitan ram manjhi, jdu, janata dal united patna high court, Bihar Governor Keshari Nath Tripathi

In a major setback to former Bihar chief minister Nitish Kumar, Patna High Court on Wednesday stayed his election as Janata Dal (United)'s state legislature party leader.

పాట్నా హైకోర్టులో నితీష్ కుమార్ కు చుక్కెదురు..

Posted: 02/11/2015 02:30 PM IST
Patna high court stays nitish kumar s election as jdu legislature party chief

బీహార్ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. తనకు మద్దతుగా 130 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందంటూ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠికి వారి సంతకాలతో జాబితాను అందజేసిన నితీష్ కుమార్ కు పాట్నా హైకోర్టులో చుక్కెదురైంది. నితీష్ కుమార్ ఎన్నిక చెల్లదంటూ కోర్టు అక్షేపించింది. సొమవారం రోజున జేడీయు శాసనసభా పక్ష నేతగా ఎలా ఎన్నుకున్నారని కోర్టు ప్రశ్నించింది. బీహార్ లో ముదురుతున్న రాజకీయ సంక్షోభాన్ని రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి పరిష్కరిస్తారని.. అయనదే తుది నిర్ణయమని చెప్పింది. దీంతో నితీష్ కుమార్ వర్గం ఖంగుతినింది.

దళితుడైనందునే తమ నేతను శాసనసభా పక్ష నేతగా తొలగించడంతో పాటు పార్టీ నుంచి కూడా బహిష్కరించారని బీహార్ ముఖ్యమంత్రి జతిన్ రాం మాంఝీకి చెందిన అనుయాయువులు పాట్నా హైకోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం మాంఝీని తొలగించడానికి కారణాలపై నిలదీసింది. నితీష్ కుమార్ ఎన్నికై పై స్టే విధించింది.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని, అందుకు తగ్గ సంఖ్యబలం తమకు వుందని, తనకు మద్దతునిస్తున్న సభ్యులతో పాటు రాష్ట్రపతిని కలిసేందుకు ఇవాళ సాయంత్రం అపాయింట్ మెంట్ కోరిన నితీష్ కుమార్ మంగళవారం రాత్రే ఢిల్లీకి చేరకున్నారు. ఇంతలో పాట్నా హైకోర్టు తీర్పును వెలువరించడంతో రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసకుంటారో వెచి చూడాల్సిందే.

మరోవైపు బీహార్ లో రాజకీయ అనిశ్చితి నెలకోనడంపై కేంద్ర హోం శాఖ దృష్టి సారిందింది. బీహర్ లో సంక్షోభ నివారణ చర్యలు చేపట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. రాజ్యాంగ నిబంధల ప్రకారం ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందన్న దానిపై కేంద్రం దృష్టి సారించగా, మరో వైపు నితిష్ కుమార్ తనకు 130 మంది సభ్యుల బలం వుందని పేర్కోనడం.. అటార్ని జనరల్ అభిప్రాయాన్ని కోరింది కేంద్రం. బడ్జెట్ సమావేశాలకు ముందే శాసనసభలో బలం నిరూపించుకోవాలని నితీష్, లాలూ వర్గాలు అనుకుంటున్నాయి. మంగళవారం నాడు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నట్లు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ సీనియర్ నేత నితీష్ కుమార్ ఈరోజు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ త్రిపాఠి నుండి స్పందన రాకపోవడంతో ఎమ్మెల్యేలతో కలిసి తాము డిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం బీహార్‌లో బలాబలాలు... మొత్తం స్థానాలు : 243... ఖాళీలు : 10 సర్కార్‌ ఏర్పాటుకు మేజిక్‌ ఫిగర్‌ : 117 జేడీ(యూ) కూటమి : 147 జేడీయూ (115), ఆర్జేడీ(24), కాంగ్రెస్‌(5), సీపీఐ(1), స్వతంత్రులు(2) బీజేపీ కూటమి: 90 బీజేపీ(87), స్వతంత్రులు(3)

.జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nitish kumar  jitan ram manjhi  jdu  janata dal united patna high court  

Other Articles