Woman teaches lesson to molester

Woman lesson to molester, business man molests women, business man molests co passenger, business man molesting video goes viral, businessman molestation in plane, bhuvaneshwar businessman molestation, women passenger, filed FIR, Indigo flight, molested, RK Jhunjhunwala, sexual assault,, sexual harrasment

A 30 year old woman taught a lesson to Singapore-based Indian businessman who misbehaved with her in a flight.

ITEMVIDEOS: విమానంలోనూ లైంగిక వేదింపులు.. మహిళ గుణపాఠం

Posted: 02/03/2015 02:59 PM IST
Woman teaches lesson to molester

సభ్య సమాజం తలదించుకునేలా తన సహచర ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ మధ్య వయస్కుడైన వ్యాపారవేత్తకు ఆ మహిళ తగిన రీతిలో స్పందించి మంచి గుణపాఠాన్ని నేర్పింది. సరిగ్గా విమానం లాండ్ అయని క్షణంలో ఆమె చేసిన పనికి సదరు వ్యాపారవేత్త సిగ్గుతో తలదించుకున్నాడు. అంతేకాదు లైంగిక వేదింపులకు పాల్పడితే ఎలా వుంటుందో కూడా రుచిచూపించే విధంగా వీడియోను తీసి యూట్యూబ్ లో పోస్టు చేసింది. ఇప్పుడా వీడియో సామాజిక వైబ్ సైట్లలో సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ముంబై నుంచి భువనేశ్వర్ కు బయలుదేరి వెళ్తున్న విమానం గగనతలంలో వుండగా తన వెనక కూర్చున్న వ్యక్తి చేతులు ఆ మహిళకు తగిలాయి. విమానం సీటు సందులోంచి చేతులు తగలడంతో పొరబాటున వెనుక కూర్చున్న వ్యక్తి తగిలించాడనుకుని నిమ్మకుండింది ఆ మహిళ. అంతలో మరోమారు మళ్లీ తగిలాయి. దీంతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని గమనించి మహిళ విషయాన్ని విమాన సిబ్బందికి తెలిపింది. అయినా మళ్లీ అదే చర్య. దీంతో విసిగిపోయిన ఆమె ధైర్యం కూడదీసుకుని అతని వెకిలిచేష్టలను వీడియో తీసింది. సరిగా విమానం లాండ్ అవుతున్న సమయంలో బిగ్గరగా కేకలు వేసింది.

అరుపులు విన్న విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు అందరూ అక్కడికి చేరుకున్నారు. ఆ మహిళకు అండగా నిలిచారు. తోటివారి సహాయంతో ఆమె ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాధారణంగా ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే మహిళలు ప్రతిఘటించడానికి భయపడతారు. కానీ అలా చేయడం కూడా నేరం అనేది తన అభిప్రాయమని ఆమె పేర్కొంది. తన విషయానికి వస్తే చట్టాలు ఏం చేయలేవని తెలిసి, అందరి ముందు అతడిని అవమానం జరగాలని భావించి గట్టిగా అరిచానని' యువతి తెలిపింది.  కాగా సదరు 'పెద్ద' మనిషి భువనేశ్వర్కు చెందిన పలు కంపెనీలకు ఛైర్మన్. అయితే  జున్జున్వాలా పోలీసులు మాత్రం అతడిని కొద్దిసేపు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RK Jhunjhunwala  sexual assault  molestation  sexual harrasment  

Other Articles