Whatsapp message reply accounted to his transfer

whatsapp message reply, ASI Thirupal, hindupuram rural police station, balakrishna, Ananthapur, chilamathuru, whatsapp, balakrishna pa, ASI trasfer, tirupal, quarell in tdp, asi transfered, MLA, balakrishna, Hindupuram, balakrishna personal assitant sheker,

hindupuram rural police station ASI Thirupal reply to whatsapp message made his transfer

వాట్సాప్ లో రిప్లై.. బదిలీ చేయించింది..

Posted: 02/03/2015 03:06 PM IST
Whatsapp message reply accounted to his transfer

సామాజిక మీడియాలో ఎలా వున్నా గోడవ తే్చి పెడుతోందని ఇంతకు ముందు వరకు అతనికి కూడా తెలియదు. అదీగాక అలవాటులో చేసే పోరబాటుతో తన ఉద్యోగంపైకి వస్తుందని కూడా అనుకోలేదతను. వాట్సాప్‌లో వచ్చిన ఓ ఫొటో చూసి అలవాటుగా థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చిన ఏఎస్‌ఐ అనూహ్యంగా బదిలీకి గురైయ్యారు. వివరాల్లోకి వెళితే. గత నెల 28న అనంతపురం జిల్లా చిలమత్తూరు మండల టీడీపీ నాయకుల సమావేశం రసాభాసాగా మారింది. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్ వ్యవహార శైలిపై ఓ నేత నిలదీయడంతో మరో వర్గం ఆయనపై దాడికి దిగింది.

 ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి ఒకరు 'బాలయ్య పీఏపై విమర్శలు' అంటూ ఓ ఫొటోను వాట్సాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ మెసేజ్ హిందూపురం మీడియా గ్రూప్‌లో ఉన్న వారందరికీ వెళ్లింది. ఈ గ్రూప్‌లో పోలీసు అధికారులు కూడా ఉన్నారు. హిందూపురం రూరల్ పోలీసుస్టేషన్‌కు డిప్యుటేషన్‌పై వచ్చిన ఏఎస్‌ఐ తిరుపాల్‌కు ఏ ఫొటోలు వచ్చినా థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చే అలవాటు ఉంది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో వచ్చిన ఇమేజ్ చూసి థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చారు. ఈ విషయాన్ని బాలకృష్ణ పీఏ శేఖర్ దృష్టికి తీసుకెళ్లిన కొందరు వారి స్వామి భక్తిని చాటుకునే ప్రయత్నంలో భాగంగా కథను మరోలా అల్లి చెప్పారు.

దీంతో బాలయ్య పీఏ .. ఏఎస్‌ఐ తిరుపాల్ పై ఫైర్ అయ్యారు. తనను నిలదీస్తే ఎందుకంత సంతోషం అంటూ డీఎస్పీ సుబ్బారావు వద్ద తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. దీంతో తిరుపాల్‌ను హుటాహుటిన సోమందెపల్లెకు బదిలీ చేశారు. ఇక చేసేది లేక తిరుపాల్ సోమందెపల్లెకు వెళ్లారు. అయితే ఇక మీదట తాను సోషల్ మీడియాకు దూరంగా వుంటానని పూనుకున్నారు. సోషల్ మీడియాలో వున్నా.. రిప్లైలు మాత్రం ఒకటికి రెండు సార్లు అటోచించి ఇవ్వాలని భావిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : WhatsApp  balakrishna pa  ASI trasfer  tirupal  

Other Articles