Edinboro university scientists biological clock human death time

biological clock, edinboro university scientists, human death timings, biological scientists, human organ function, human chemical changes, human body, human body scientist, bilogocial death clock

edinboro university scientists biological clock human death time : the edinboro university scientists found the biological clock which represents the human death time.

మృత్యువును ముందే తెలిపే ‘జీవగడియారం’

Posted: 02/02/2015 10:50 AM IST
Edinboro university scientists biological clock human death time

భవిష్యత్తులో తమ జీవితం ఎలా గడుస్తుందోనన్న విషయాలను ముందుగానే తెలుసుకునేందుకు ప్రతిఒక్కరు ఉత్సుకత వ్యక్తం చేస్తారు. అయితే.. ఇందులో మరణతేదీని ముందే తెలుసుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే.. తమ మృత్యువు ఎప్పుడో తెలుసుకుంటే ఆ సమయంలోకల్లా తమ పనులను ముందుగానే నిర్వర్తించుకోవచ్చు కాబట్టి! ఈ విషయమై కొందరు శాస్త్రవేత్తలు సుదీర్ఘకాలంగా పరిశోధనలు జరుపుతూనే వున్నారు.

ఈ నేపథ్యంలోనే ఎడిన్‌బరో వర్సిటీ శాస్త్రవేత్తలు.. మనిషి డీఎన్ఏలో రసాయన మార్పులను బట్టి, అవయవాల పనితీరును బట్టి, వాటి వయస్సును తెలిపే ఒక జీవగడియారాన్ని కనుగొన్నారు. అంటే.. ఆ అవయవాలు ఎంతకాలం వరకు పనిచేస్తాయోనన్న దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి, సదరు అవయవాల పరిమితకాలాన్ని లెక్కగట్టే ఓ గడియారాన్ని రూపొందించారు. ఈ జీవగడియారంతో మనిషి జీవితకాలాన్ని ముందుగానే అంచనా వేయొచ్చని వారు అంటున్నారు.

అదెలా అంటే.. ఈ జీవ గడియారం వయస్సు, మనిషి వయస్సుకు మధ్య వున్న సంబంధాన్ని బట్టి ఓ నమూనా తయారు చేశారు. 5 వేలమంది వృద్ధల జీవన విధానాన్ని 14 ఏళ్లపాటు గమనించిన అనంతరం వారు ఈ నమూనాను రూపొందించడం జరిగింది. దీని ప్రకారం.. జీవగడియారం వయస్సుతో సమానంగా వున్నవారితో పోలిస్తే.. వ్యక్తి వయస్సు కంటే జీవగడియారం వయస్సు ఎక్కువగా వుంటే.. ఆ వ్యక్తి మరణానికి దగ్గరగా వున్నట్లు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

అలాగే ధూమపానం, మధుమేహం, గుండెజబ్బుల ద్వారా సంభవించే మరణాలను కూడా శాస్త్రవేత్తలు పరిగణనలోకి తీసుకున్నారు. అయితే.. జీవన విధానం, జన్యు కారకాల్లో ఏది జీవగడియార వయసును ప్రభావితం చేస్తుందో స్పష్టంగా తెలియరాలేదని మారియోని అనే శాస్త్రవేత్త తెలిపారు. ఏదైతేనేం.. ఇకనుంచి ప్రతిఒక్కరు ఈ జీవగడియారం నుంచి తమ మృత్యువును ముందుగానే తెలుసుకోవచ్చన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles