Central ministry notify loans andhra pradesh telangana state before bifurcation

central ministry, andhra pradesh state loan, telangana state loan value, central ministries notifications, andhra loan weavers, telangana loan weavers

central ministry notify loans andhra pradesh telangana state before bifurcation : central ministries has released the loan values of andhra pradesh and telangana states before bifurcation

ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల్లో కళ్లుచెదిరే అప్పుల లెక్కలు...

Posted: 02/02/2015 10:08 AM IST
Central ministry notify loans andhra pradesh telangana state before bifurcation

తెలుగురాష్ట్రాల్లో అభివృద్ధి ఏమేరకు జరిగిందో తెలీదుగానీ.. అప్పు మాత్రం గంపెడుకొద్దీ నిండిపోయి వుంది. కళ్లు చెదిరేలా కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు భారీ మొత్తంలో డబ్బులు పంచినట్లు తాజాగా ఓ నోటిఫైను విడుదల చేసింది. ఇందులో భాగంగా విభజనకు ముందు రెండు రాష్ట్రాల్లోని అన్ని సంస్థలకు ఎంతమేర డబ్బులు పంచిందోనన్న జాబితాను రిలీజ్ చేసింది.

విభజనకు ముందు సెక్యూరిటీ విక్రయం, నాబార్డు, చిన్నమొత్తాల పొదుపు సంస్థ నుంచి చేసిన అప్పులు, తదితర వివాదాలు లేని రుణాల జాబితాను మాత్రమే విభజించి.. జనాభా ప్రాతిపదిక మీద కేంద్రమంత్రిత్వశాఖ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు పంచుతూ ఈ తాజా నోటిఫై చేసింది. ఉమ్మడి రాష్ట్రానికి రూ.1.48 లక్షల కోట్ల అప్పు వుండగా.. అందులో తెలంగాణాకు రూ.61.71 వేలకోట్లు, ఆంధ్రప్రదేశ్ కు రూ.86.34 వేల కోట్లు పంచినట్లు కేంద్రం వెల్లడించింది.

కేవలం ఇదిమాత్రమే కాదు.. విదేశీ ఆర్థిక సంస్థలు, కేంద్రం మంజూరు చేసిన రూ.18.43 వేలకోట్ల రూపాయల అప్పులో రెండు రాష్ట్రాలకు వాటా తేల్చాల్సి వుంది. ఇదంతా యూపీఏ హయాంలో విడుదలైన వాటా విలువలు! ఇంత భారీ మొత్తంలో అప్పుల వివరాలు వెల్లడయ్యాయి కానీ.. అభివృద్ధి ఏమేరకు జరిగిందోనన్న వ్యవహారంపై ఒక్క క్లారిటీ కూడా లేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : central ministry  andhra pradesh state loan  telangana state loan value  

Other Articles