Ms narayana passed away

MS Narayana, MS Narayana movies, MS Narayana death news, MS Narayana death, MS Narayana latest news, MS Narayana comedian, comedian MS Narayana news, comedian MS Narayana passed away, MS Narayana passed, tollywood comedian MS Narayana dead, ms narayana family members, ms narayana filmography, ms narayana life story

Tollywood mourns as comedian MS Narayana passed away

కమేడియన్ ఎంఎస్ నారాయణ కన్నుమూత

Posted: 01/23/2015 10:41 AM IST
Ms narayana passed away

ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ పరమపదించారు. ఆనారోగ్యంతో కొండాపూర్ కిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మృతి చెందారు. ఈ విషయాన్ని  ఎమ్మెస్ నారాయణ కుమారుడు విక్రమ్ ధ్రువీకరించారు. కొద్ది రోజులుగా ఎమ్మెస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలుగు సినీ అభిమానులకు ఎమ్మెస్ నారాయణగా సుపరిచితుడైన మైలవరపు సూర్యనారాయణ ఏప్రిల్ 16, 1951లో పశ్చిమగోదావరి జిల్లాలోని నిడమర్రులో జన్మించారు. ఆయనకు భార్య కళాప్రపూర్ణ, కుమారుడు విక్రమ్,  కుమార్తె శశికిరణ్  ఉన్నారు.

సుమారు 700 సినిమాల్లో నటించిన ఎమ్మెస్ ప్రతిష్టాత్మక నంది అవార్డును అయిదుసార్లు అందుకున్నారు. చివరగా ఆయనుకు 'దూకుడు' సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఎమ్మెస్ లెక్చరర్‌గా జీవితం ప్రారంభించి సినిమాలపై మక్కువతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. లింగబాబు లవ్‌స్టోరితో ఆయన సినీ జీవితం ప్రారంభమైంది. తాజాగా ఎమ్మెస్ నటించిన పటాస్, రేయ్, శంకర సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మానాన్నకు పెళ్లి, రామ్‌సక్కనోడు, సరదాకు పోదాం రండి, శివమణి, దూకుడు సినామాలకు ఉత్తమ హస్యనటుడిగా ఎమ్మెస్ నంది అవార్డులందుకున్నాడు.

జి. మనోహర్

 

సంభంధిత వార్తలు:నారాయణకు ప్రముఖుల సంతాపం..

నారాయణకు ప్రముఖుల సంతాపం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  MS Narayana  comedian  Actor  

Other Articles