Ancient tunnel unearthed in mysuru near palace

ancient tunnel unearthed, mysuru tunnel unearthed, mysore tunnel unearthed, mysuru palace tunnel, mysore palace tunnel, vishwa manava park tunnel, gun house, gun house circle

An ancient tunnel was unearthed near Vishwa manava Park at Gun House circle in Mysuru.

మైసూరు మహారాజు కోటలో బయటపడిన సొరంగం

Posted: 01/22/2015 03:56 PM IST
Ancient tunnel unearthed in mysuru near palace

కర్ణాటకలోని చారిత్రాత్మక అద్భుత కట్టడానికి ఉదాహరణగా నిలుస్తున్న ప్రాచీన కళాఖండం.. మైసూరు ప్యాలెస్. అయితే ఇప్పడదే వార్తల్లో నిలిచింది. ప్రాచీణ కళాసంపద వార్తల్లో నిలవడమేంటని కంగారు పడకండి.. ప్రాచీన కాలంలో రాజులు, ధనాగారాలతో పాటు ఆయుధ కర్మాగారాలను కూడా రహస్యంగా వుంచేవారన్న నిజానికి ఇప్పుడు మైసూరు మహారాజు కోట సాక్ష్యంగా నిలించింది. అదెలా అంటారా.. ప్రాచీన కాలంలో నిర్మించిన ఈ కోటలో ఒక అరుదైన సొరంగం బయటపడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

మైసూరు ప్యాలెస్‌కు సమీపంలో ఓ భారీ సొరంగ మార్గం వెలుగు చూసింది. మైసూరులోని విశ్వమానవ పార్క్ వద్దరహదారి విస్తరణ పనులు చేస్తుండగా ఈ సొరంగం బయట పడింది. సుమారు మూడు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల ఎత్తులో ఈ సొరంగం అర కిలోమీటర్‌కు పైగా పొడవున్నట్లు అధికారులు గుర్తించారు. ప్యాలెస్ నుంచి రాజుల ఆయుధ తయారీ కేంద్రం గన్ హౌస్ వరకూ ఇది నిర్మించి వుంది. ఈ సొరంగ మార్గాన్ని గతంలో రాజులు రహస్య మార్గంగా వాడుకున్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bangalore  mysore palace  ancient tunnel  

Other Articles