High alert in economic capital after intelligence inputs on terror attack

intelligence inputs, US warned Pakistan, IB report to the Mumbai, Hizbul Mujaheedin, Jamaat-ud-Dawa, Pakistan sponsored jihadi elements, IB report to the Mumbai, Jamaat-ud-Dawa, Pakistan sponsored jihadi elements, Four action groups in India, Pirpanjal mountainous range, 200 terrorists, Indian Mujahideen, banned terrorist group IM, indian mujahideen sleeper cells, Im sleeper cells, Im sleeper cells in karnataka, IS sympathiser Mehdi Masroor Biswas, british girl friend nikki joseph alias ayesha, salman moinuddin, hyderabad software engineer, isis, islamic state,

Mumbai has been put on high alert after intelligence inputs warning about a terror attack by Pakistan-based jihadi elements targeting Siddhivinayak Temple.

‘ఉగ్ర‘దాడుల నేపథ్యంలో ఆర్థిక రాజధానిలో హైఅలర్ట్

Posted: 01/22/2015 12:11 PM IST
High alert in economic capital after intelligence inputs on terror attack

దేశ గణత్రంత్య దినోత్సవాల వేడుకలకు సిద్దమవుతున్న తరుణంలో దేశం యావత్తు అప్రమత్తమైంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు దేశంలో దాడులకు తెగబడే అవకాశముందన్న నిఘావర్గాల సమాచారంతో దేశవ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ముంబాయిలోని సిద్దివినాయక ఆలయంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు తెగబడతారని నిఘావర్గాల హెచ్చరికలతో ముంబై పోలీసులు ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ముంబాయి సహా మహారాష్ట్ర పోలీసులకు నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు జమాత్ వుద్ దావా, లష్కరే తోయిబా, జైష్ ఈ మహమ్మద్, హిజ్బల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు భారత దేశ అర్థిక రాజధానిపై దాడులకు తెగబడవచ్చునని తెలుస్తోంది. భారత గణత్రంత్య దినోత్సవ వేడుకలకు అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్న నేపథ్యంలో భారత్ లో దాడులకు తెగబడేందుకు ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు సమాచారం. అయితే ఈ నెల 28న దాడులకు తెగబడేందుకు కుట్రలు పన్నుతున్నట్లు నిఘావర్గాల సమాచారం.

ఈ నాలుగు ఉగ్రవాద బృందాలలో ఒకటి ముంబాయిలో , మరోకటి రాజస్థాన్, మూడవది ఉత్తర్ ప్రదేశ్, నాల్గవది ఒడిషాలలో దాడులకు తెగబడనున్నాయని ఆయా రాష్ట్ర పోలీసులకు నిఘా వర్గాల సమాచారాన్ని అందించాయి. ముంబాయిలో ముఖ్యంగా చారిత్రాత్మక సిద్ది వినాయక ఆలయం ప్రతీ మంగళవారం భక్తలతో కిటకిటలాడుతుందని, ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశాలు వున్నాయని నిఘా వర్గాల సమాచారం. ఇందుకుగాను అబుల్లా అల్ ఖురేషీ నేతృత్వంలోని నలుగురు పాతికేళ్ల యువకులు  నజీర్ అలి, జాబెద్ ఎక్బాల్, మొబిద్ జమీన్, శంషేర్ దాడులకు తెగబడనున్నారని నిఘావర్గాలు హెచ్చరించాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : terror attack  Siddhivinayak Temple  Maharashtra police  Hizbul Mujaheedin  

Other Articles