Pranab mukherjee criticizes congress for disturbing parliament

Pranab Mukherjee, Pranab Mukherjee on parliament, Pranab Mukherjee on law makers, Pranab Mukherjee latest, Pranab Mukherjee speech, Indian Parliament, parliament schedule, NDA ordinance, congress on ordinance

Pranab Mukherjee criticizes congress for disturbing parliament : President Pranab says disruption of Parliament leads loss of time and resources. ordinance is a chance of making law in an emergency time, no need to make controversies on this issue pranab mukharjee says

కాంగ్రెస్ పరువు తీసిన ప్రణబ్

Posted: 01/19/2015 04:38 PM IST
Pranab mukherjee criticizes congress for disturbing parliament

కాంగ్రెస్ పార్టీపై రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ పరోక్ష విమర్శలు చేశారు. ప్రతిపక్షమంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించటం తప్ప.., ఇబ్బంది పెట్టడం కాదన్నారు. పార్లమెంటు సమావేశాలకు తరుచుగా ఆటంకాలు కలగటం పట్ల ప్రణబ్ అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తక్కువ సంఖ్యలో ఉన్న ప్రతిపక్ష సభ్యులు మెజార్టీ అధికార పక్షాన్ని ఏమి చేయలేరని చెప్పారు. సెంట్రల్ యునివర్సిటీల విద్యార్థులు, అద్యాపకులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్బంగా ప్రణబ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

సమయం వృధా కావటం వల్ల చట్టాల రూపకల్పన, చర్చలపై ప్రభావం పడుతుందన్నారు. చట్టాలు చేయటంలో పార్లమెంటు విఫలం అయిందంటే.., ప్రజల విశ్వాసం కోల్పోయినట్లే అని చెప్పారు. పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల మద్య చర్చలు పరస్పర సహకార కోణంలో ఉండాలి తప్ప.., గొడవలకు దారితీయవద్దన్నారు. అధికార-విపక్ష పార్టీలు సభలను సజావుగా నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తొలి తరం పార్లమెంటు సభలకు హాజరయ్యే సభ్యుల సంఖ్య ఇప్పటితరం సభలకు హాజరయ్యే వారితో పోలిస్తే రెట్టింపు ఉంటుందని చెప్పారు. దీన్ని బట్టే సభ్యులకు పార్లమెంటుపై ఉన్న శ్రద్ధ, ప్రజా సమస్యల పరిష్కారంపై ఉన్న చిత్తశుద్ధి కన్పిస్తుందన్నారు.

ఇక ఆర్డినెన్స్ విషయంపై కూడా వీడియో కాన్ఫరెన్స్ లో ప్రణబ్ మాట్లాడారు. ఆర్డినెన్స్ అనేది అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాలన్నారు. రాజ్యాంగం ఇచ్చిన పరిమిత అధికారాల్లో ఇది ఒకటని చెప్పారు. దీనిపై కూడా వివాదాలు చేయటం సరికాదన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఆర్డినెన్స్ ల ద్వారా చట్టాలు చేయటంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతున్న నేపథ్యంలో ఇద్దరికి కౌంటర్ ఇచ్చేలా ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pranab Mukharjee  Indian Parliament  Ordinance  

Other Articles