Satirical magazine record sales across france

Charlie Hebdo, Charlie Hebdo paper in France, Atack on Charlie Hebdo, al qaeda, paris, shooting, french, amedy coulibaly, hayet boumddiene, 50 lakhs copies, magazine sales increased, hebdo magazine sales reached half crore, half crore sales of charlie hebdo,

Days after witnessing a massacre, satirical magazine Charlie Hebdo was back on newsstands across France on Wednesday. Al Qaeda in Yemen admits responsibility for Charlie Hebdo attacks and warns West of more,

వేల నుంచి లక్షలకు సర్క్యూలేషన్.. దాడి అల్ ఖైదా పనే..

Posted: 01/14/2015 10:09 PM IST
Satirical magazine record sales across france

చార్లీ హెబ్డో మునుపెన్నడూ లేని రీతిలో కొత్త సంచికను 50 లక్షల ప్రతులతో విడుదల చేయలని నిర్ణయించింది. తొలుత 30 లక్షలు అనుకుంది. కొత్త సంచిక బుధవారం విడుదలైంది. చార్లీ హెబ్డోకు కార్యాలయ స్థలాన్ని సమకూర్చిన లిబరేషన్ వార్త పత్రిక ఈ విషయాన్ని విడుదలకు ముందు చెప్పింది. కొత్త సంచిక ముఖచిత్రం ఛాయాచిత్రాన్ని పోస్ట్ చేసింది. సాధారణంగా అరవై వేల ప్రతులతో నడిచే ఈ పత్రికకు డిమాండుకు బాగా పెరగడంతో జనవరి 14 సంచికను 50 లక్షల ప్రతులకు పెంచింది. కాగా, ఈ పత్రిక బుధవారం విడుదల కాగానే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

పుస్తకాల దుకాణాలు తెరవకముందే భారీ ఎత్తున ప్రజలు క్యూలో నిలబడ్డారట. తాను షాప్ తెరవకముందే దాదాపు అరవై, డెబ్బై మంది వరుసలో నిలబడ్డారని కియోస్క్‌లోని ఓ పుస్తక యజమానురాలు తెలిపారు. తాను తీసుకు వచ్చిన 450 పుస్తకాలు పదిహేను నిమిషాల్లో అమ్ముడుపోయాయని తెలిపారు. ఇది ఆశ్చర్యకరమన్నారు. దాడి ఘటన తరువాత దానిని నిరసిస్తూ.. సెటైరికల్ పత్రిక సర్క్యూలేషన్ ను ఏకంగా వేల స్థాయి నుంచి లక్షల సంఖ్యకు పెంచారు.

చార్లీ హెబ్డోపై దాడులు చేసింది మేమే: అల్ ఖైదా

ఫ్రాన్స్‌లోని చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయంపై దాడి చేసింది తామేనని అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈమేరకు యెమెన్‌లోని ఆ ఉగ్రవాద సంస్థ నేతలు ఒక వీడియో క్లిప్‌ను విడుదల చేశారు. చార్లీ హెబ్డోపై దాడులకు పాల్పడింది తామేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఫ్రాన్స్ దేశం మరిన్ని ఉగ్రవాద దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయం పైన దాడి చేసింది తామేనని అల్ ఖైదా ప్రకటించింది. గత వారం చార్లో హెబ్డో పత్రిక కార్యాలయం పైన జరిగిన దాడిలో 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ దాడి చేసింది తామేనని అల్ ఖైదా ప్రకటించింది. ఈ దాడికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు హతమార్చారు.

కాగా, ఫ్రెంచ్ వారపత్రిక చార్లీ హెబ్డో కార్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన అమానుషమైన దాడినుంచి ఫ్రాన్స్ ఇంకా పూర్తిగా తేరుకోకముందే మంగళవారం తాజాగా మరోసారి ఆ దేశానికి ఉగ్రవాదులనుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి ఉత్తర ఆఫ్రికాలోని అల్‌ఖైదా సంస్థ అయిన అల్‌ఖైదా ఇన్ ఇస్లామిక్ మెఘ్రెబ్ (ఎక్యుఐఎం) అనే సంస్థ ఈ బెదిరింపులు చేసింది. చార్లీహెబ్డో పత్రికపై జరిగిన దాడిని ఉత్తర ఆఫ్రికాలోని అల్‌ఖైదా శాఖ ఎక్యుఐఎం ప్రశంసిస్తూ గత బుధవారం ఆ పత్రిక కార్యాలయంపై దాడి చేసి 12 మంది సిబ్బందిని హతమార్చిన కౌచి సోదరులను ఆదర్శంగా తీసుకోవాలని ముస్లింలకు పిలుపునిచ్చినట్లు ఫ్రాన్స్ నిఘా సంస్థ ‘సైట్' తన ట్విట్టర్‌లో పేర్కొంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Charlie Hebdo  Al Qaeda  France  Charlie Hebdo Atack  magazine sales  

Other Articles