Mumbai movie artists raped by event manager

rape case, movie artist rape case, mumbai movie artists, women artists, movie actresses rape, gangrape cases

mumbai movie artists raped by event manager : a movie artist being raped by event manager charcope in mumbai

అవకాశానికి ఆశపడి అత్యాచారానికి గురైంది!

Posted: 01/09/2015 07:04 PM IST
Mumbai movie artists raped by event manager

‘‘ఏనాడు అయితే మహిళ స్వతంత్రంగా ఒంటరిగా అర్థరాత్రి తిరగగలుగుతుందో.. ఆనాడే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు’’ అన్న ఓ మహనీయుడు మాటలకు నేడు విలువే లేకుండా పోయింది. మహిళ అర్థరాత్రి కాదుకదా.. కనీసం వెలుగు వున్న సమయంలోనూ వారి జీవితాలు వెలగకుండా ఆరిపోతున్నాయి. ఒంటరిగా మహిళ బయటికెళ్తే ఇంటిరి తిరిగొస్తుందో..? లేదో..? అన్న భయం కుటుంబసభ్యులను ఓ రాక్షస నీడలాగా వెంటాడుతూనే వుంటుంది.

ఏ తల్లైతే ఓ మహిళ బిడ్డకు జన్మినిచ్చి జీవితాన్ని ప్రసాదిస్తుందో.. ఇప్పుడు ఆ తల్లికే జీవితం లేకుండాపోతోంది. ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచారాలు, ఆగడాలు నిత్యం జరుగుతూనే వున్నాయి. రోజులు ఐదే అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తుంటే.. ఇంకా వెలుగులోకి రానివి ఎన్ని వుంటాయో లెక్కగట్టలేం! ఏ రంగంలో అయినా సరే.. మహిళలకు రక్షణా లేకుండా పోతోంది. తాజాగా ఓ మహిళ రంగుల ప్రపంచంలో విహరించాలని కలలుకంటే.. అవే ఆమెకు చీకటిలోకి తీసుకెళ్లాయి.

చిత్రపరిశ్రమలో అవకాశం వస్తోందంటే ఎవరైనా వదులుకుంటారా..? అది కూడా బాలీవుడ్’లో అంటే ఎగిరి గంతేస్తారు. చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ ఇప్పుడిప్పుడు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న ఓ నటి.. హీరోయిన్’గా అవకాశం వస్తుందని ఆశపడి చివరికి అత్యాచారానికి గురైంది. తెరమీద ఓ వెలుగు వెలిగిపోదామని ఎన్నో ఆశలు, కలలు కన్నా ఆమెకు చివరికి వెలుగే లేకుండా పోయింది. అసలు ఆమె ఎలా మోసపోయిందో తెలుసుకోవాలంటే.. వివరాల్లోకి వెళ్లాల్సిందే!

ఇండస్ట్రీలో చిన్నచిన్న పాత్రలు చేసుకుంటున్న ఓ నటి.. తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకోవాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తూనే వుంది. ఈ నేపథ్యంలోనే సదరు నటి సుబర్బన్ చార్’కోప్ నిర్వహించిన ఓ ఈవెంట్’లో పార్టిసిపెంట్ చేసింది. అప్పుడు వారిద్దరికి పరిచయం ఏర్పడింది. సినిమాల్లో ఆమెకు ఆసక్తిని తెలుసుకున్న అతగాడు.. ఆమెకు అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో తాను కంటున్న కలలు చివరికి నిజమయ్యే ఘడియలు వచ్చాయన్న ఆనందంతో అతని మాయమాటలకు ఆమె లొంగిపోయింది. అవకాశం కోసం అతనివెంటే పరుగులు తీసింది.

అదే ఈవెంట్’లో వచ్చిన ముఫ్థాల్ ఘడియాలి అనే వ్యక్తిని చార్’కోప్ ఆమకు పరిచయం చేశాడు. త్వరలో తాను ఓ సినిమా తీయబోతున్నానని, అందులో ఛాన్స్ ఇప్పిస్తానంటూ నమ్మించాడు. కొద్దిరోజుల కిందట సినిమాకు సంబంధించిన కాంట్రాక్ట్‌పై సంతకం చేయాలని చెప్పి ఇంటికి పిలిచాడు. దీంతో అతని ఇంటికి వెళ్లిన ఆమెకు అతగాడు ఓ కూల్’డ్రింక్ ఇచ్చాడు. అంతే అది తాగి ఆమె మత్తులోకి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత తిరిగి స్పృహలోకి వస్తే.. జరిగాల్సిన ఘాతుకం జరిగిపోయింది. దీంతో తనకు అన్యాయం జరిగిందని గమనించిన సదరు నటి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన సదరు నటి.. తనకు అవకాశం ఇప్పిస్తానంటూ తనను ఇంటికి పిలిచి, కూల్’డ్రింక్ ఇచ్చి అత్యాచారం చేశాడంటూ బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ఈవెంట్ మేనేజర్ సుబర్బన్ చార్’కోప్’ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : movie actresses rape case  telugu news  

Other Articles