I movie financial controversies madras high court orders ravichandran picture house organisation

I movie news, i movie controversies, i movie release date, i movie latest news, tamil director shankar, director shankar news, amy jackson latest news, chiyan vikram news, producer oscar ravichandran

I movie financial controversies madras high court orders ravichandran picture house organisation : finally i movie is releasing on january 14

ఫైనల్’గా ‘ఐ’ రిలీజ్’పై క్లారిటీ వచ్చింది...!

Posted: 01/09/2015 05:46 PM IST
I movie financial controversies madras high court orders ravichandran picture house organisation

అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించడంలో తనకూ సాటి ఎవరూ లేరని నిరూపించుకున్న శంకర్ దర్శకత్వంలో మరో విజువల్ వండర్ ‘ఐ’ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే! ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జవనరి 14వ తేదీన రిలీజ్ అవుతుందని ప్రొడ్యూసర్, ఆస్కార్ ఫిలిమ్స్ అధినేత రవిచంద్రన్ ఎప్పటినుంచో ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించేశారు.

అయితే నిర్మాతకు, ఫైనాన్స్ చేసిన పిక్చర్ మీడియా వర్క్స్’కు మధ్య ఆర్థిక లావాదేవీలు తలెత్తిన నేపథ్యంలో సదరు ఫైనాన్షియర్ తమకు అందాల్సిన మొత్తాన్ని ఇప్పించాల్సిందిగా హైకోర్టుకెక్కిన సంగతి విదితమే! దీంతో కోర్టు ఈ చిత్రాన్ని జవనరి 30వరకు ఆపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మరి.. ఈ మూవీ ఎప్పుడు రిలీజవుతుందోనని ప్రేక్షకులతోబాటు అందరిలోనూ ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అయితే చివరగా ఆ వ్యవహారంపై ఓ క్లారిటీ వచ్చేసిందని తాజా సమాచారం!

అనుకోకుండా ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుపోయిన ‘ఐ’ మూవీ నిర్మాత రవి, సదరు పిక్చర్ మీడియా వర్క్స్ సంస్థతో కోర్టు వెలుపల అంగీకారానికి రావడానికి చర్చలు జరిపింది. ఈ చర్చల్లో భాగంగా పివిపి అధినేత పొట్లూరి వరప్రసాద్ కూడా పాల్గొని.. తనవంతు సాయం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పిక్చర్ హౌస్ సంస్థ తమ కేసు వెనక్కి తీసుకోవడం.. కోర్టు మూవీ విడుదలకు అనుమతించడం అంతా యథావిధిగా జరిగిపోయింది.

చివరగా ఈ చిత్రం పండుగనాడు.. అంటే జనవరి 14వ తేదీన అద్భుతాలు సృష్టించడానికి సన్నద్ధం అవుతుంది. ఇదే విషయమై నిర్మాత కూడా క్లారిటీ ఇచ్చారు. ‘ఐ’ చిత్రానికి ఇక ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు, ఇతర ఇబ్బందులు లేవని ఆయన స్పష్టం చేశారు. ‘ఐ’ మూవీకి సంబంధించి అన్నీ సమస్యలు క్లియర్ అయ్యాయి. హాలీవుడ్ స్థాయికి ధీటుగా తెరకెక్కిన ఈ మూవీని జవనరి 14న యూ/ఏ సర్టిఫికెట్’తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles