Supreme court on divoce case and men rights

Supreme court, Supreme Court on gays, Supreme Court on divorce, Supreme Court on men rights, Supreme Court on women rights, Supreme Court on domestic voilence, Supreme Court latest judgements, Supreme Court key judgements, Supreme Court important judgements, Supreme Court latest judgements, divroce case filing process, divorce cases in india, funny court cases

supreme court on divoce case and men rights : Apex court respond on divorce cases and shifing cases to women preferred courts. supreme court says there is equal right to men and women in change divorce case enquiry from one court to another

మగాళ్లకు ఉందిలే మంచికాలం ముందుముందునా...!

Posted: 01/09/2015 11:13 AM IST
Supreme court on divoce case and men rights

మాకు ప్రత్యేక హక్కులు లేవని మనోవేదనతో ఉన్న పురుషులకు శుభవార్త. విడాకుల విషయంలో మగవారికీ హక్కులుంటాయని సుప్రీంకోర్టు చెప్తోంది. కేసుల విచారణలో ఆడవారు ఏ విధంగా అనుకూలంగా కేసులను బదిలీ చేసుకుంటారో.., అదే హక్కు మగవారికి కూడా ఉంటుందని స్పష్టం చేసింది. ఘజియాబాద్ కు చెందిన ఓ విడాకుల కేసును మధ్యప్రదేశ్ కు మార్చేందుకు జస్టిస్ దత్తు, జస్టిస్ సిక్రీలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ప్రతిసారి మగవారే ఎందుకు ఇబ్బందులు, కష్టాలు పడాలి? వారికి కూడా సమాన హక్కులు, అవకాశాలు ఉంటాయని స్పష్టం చేసింది.

ఇన్ని రోజులు ఆడవారు కోరుకున్నట్లుగా కేసుల విచారణను ఒక కోర్టు నుంచి వారికి దగ్గర్లో ఉండే కోర్టులకు మార్చాము. కాని ఇకపై అలా జరగదు, బదిలీల్లో పురుషులకు కూడా హక్కు ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. తాజా కేసును ఘజియాబాద్ నుంచి బదిలీ చేయమని తేల్చిచెప్పింది. గతంలో కూడా వరకట్న వేధింపులు, గృహ హింసను కొందరు మహిళలు స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని మగవారిని ఇబ్బంది పెడుతున్నారని కోర్టులు వ్యాఖ్యానించగా.., తాజాగా మగవారికీ హక్కులుంటాయని చెప్పటం గమనార్హం. ఈ తీర్పుతో మగవారికి ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని మగానుభావులు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  divorce cases  latest news  

Other Articles