Air asia flight black box pings detected

Air Asia flight crash, Air Asia flight crash latest status, Air Asia flight crash update, Air Asia update, Air Asia flight black box, Air Asia black box pings, Air Asia flight black box messages, black box, black box messages, Air Asia QZ8501, Air Asia flight deaths, Air Asia flight dead bodies, Air Asia flight search operations

Air Asia Flight black box pings detected : Investigators receives Air Asia flight black box pings from sea. divers has to confirm black box pings of Air Asia, and hopes soon it will found. Air Asia flight tail found on wednes day and search operations going on

కూలిన విమాన బ్లాక్ బాక్స్ నుంచి సందేశాలు

Posted: 01/09/2015 11:42 AM IST
Air asia flight black box pings detected

గతేడాది డిసెంబర్ 28న సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమాన ప్రమాదంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విమాన శకలాలతో పాటు, బ్లాక్ బాక్స్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపడుతున్నాయి. ఇందుకోసం రంగంలోకి దిగిన బృందాలకు బ్లాక్ బాక్స్ నుంచి సందేశాలు అందినట్లు అధికారులు చెప్తున్నారు. బ్లాక్ బాక్స్ ఖచ్చితంగా కుప్పకూలిన ఎయిర్ ఏషియా విమానందే అని ఈ విషయాన్ని సముద్ర ఉపరితలంపై గాలిస్తున్న ప్రత్యేక బృందాలు ధృవీకరించాల్సి ఉంది.

బుధవారం తోక భాగం లభ్యం కావటంతో అప్పుడే బ్లాక్ బాక్స్ కూడా దొరుకుతుందని ఆశించారు. కానీ తొక భాగం నుంచి బ్లాక్ బాక్స్ వేరు కావటంతో దీని కోసం గాలిస్తున్నారు. తోక నుంచి వేరయినా.., అది లభ్యమైన ప్రాంతంలోనే బాక్స్ ఉన్నట్లు సంకేతాలు వస్తుండటంతో గాలింపు చర్యలు వేగవంతం చేశారు. మరోవైపు ముందుగా తమ వారికి సంబంధించిన ఆనవాళ్ళు వెతికి పెట్టాలని మృతుల సంబంధీకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 46 మృతదేహాలు లభ్యం కాగా., ఇంకా రెండు వందలకు పైగా దొరకాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air Asia flight  black box  indonesia  

Other Articles