Swachh bharat telugu brand ambassadors

Swachh Bharat Brand Ambassadors, Swachh Bharat Telugu Brand Ambassadors, Pawan in Swachh Bharat, Tollywood Swachh Bharat, Modi on Swachh Bharat, nda government programmes, Venkaiah naidu latest comments, nithin in Swachh Bharat, Amala in Swachh Bharat, latest telugu news

Swachh Bharat Telugu Brand Ambassadors : Central Government Announced Telugu Brand Ambassadors for Swachh Bharat Campaingn. Koneru Hampi, Pawan Kalyan, doctor GS Rao, Galla Jayadev, Pullela Gopichand, Nithin, Kavitha, VVS Laxman, Suddala Ashok Teja, Amala And many

మోడి విజ్ఞప్తికి పవన్ ఓకే చెప్తాడా..?

Posted: 01/05/2015 07:31 AM IST
Swachh bharat telugu brand ambassadors

ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారంతో లాభం పొందిన బీజేపీ మరోసారి ఆయన్ను ఉపయోగించుకోనుంది. పవన్ క్రేజ్ ను ప్రధాని తన కార్యక్రమం కోసం వాడుకోవాలని నిర్ణయించారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతం కోసం నడుం బిగించింది. ఇంతకాలం సెలబ్రిటీలను నామినేట్ చేస్తూ సాగిన ఈ కార్యక్రమం ఇక మరింత వేగవంతం కానుంది. సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంచుకుని వారిచే ప్రజలకు అవగాహన కల్పించనుంది. ఇందుకోసం తెలుగు ప్రముఖులను ఎంపిక చేసి జాబితా ప్రకటించింది. స్వచ్ఛ భారత్ తెలుగు బ్రాండ్ అంబాసిడర్లను చూస్తే..

పవన్ కళ్యాణ్, అమల, కోనేరు హంపి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నితిన్, సుద్దాల అశోక్ తేజ, కవిత, వీవీఎస్ లక్ష్మణ్, డాక్టర్ జీఎస్ రావు, రామేశ్వర రావు, శివలాల్ యాదవ్, జీవీకే రెడ్డి సహా ఇతరులు ఈ కార్యక్రమ ప్రచారకులుగా ఎంపికయినట్లు ప్రకటించారు. వీరంతా స్వచ్ఛ భారత్ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్వచ్ఛ భారత్ లో పాల్గొనలేదు. అలాంటిది ఈ కార్యక్రమ బ్రాండ్ అంబాసిడర్ గా  ఉంటారా లేక, మోడి విజ్ఞప్తిని తిరస్కరిస్తారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swachh Bharat  Pawan Kalyan latest  telugu updates  

Other Articles