Chandrababu in social media

Chandrababu in Facebook, Chandrababu in Twitter, Chandrababu google hangout video, Chandrababu latest updates, Chandrababu comments, Chandrababu vision on AP, Andhra Pradesh latest updates, Chandrababu development programmes

Chandrababu in Social Media : Andhra Pradesh Chief minister Chandrababu Naidu become popular in Social Media like Facebook, Twitter, google hangouts. Chandrababu google hangout video have lakhs of viewers

సోషల్ మీడియా చంద్రుడీయన

Posted: 01/05/2015 08:42 AM IST
Chandrababu in social media

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోషల్ మీడియాలో చంద్రుడిగా మారిపోయారు. ఎప్పటికప్పుడు అప్ డేట్స్, లేటెస్ట్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, సహా కొత్తగా గూగుల్ హ్యాంగవుట్ ద్వారా కూడా ప్రజలతో దగ్గరగా ఉంటున్నారు. బాబు ఫేస్ బుక్ పేజిలో మూడు లక్షల నలబై వేల మంది వరకు, ట్విట్టర్ లో నాలుగు లక్షల నలబై వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక కొత్తగా గూగుల్ హ్యాంగవుట్ కార్యక్రమం మొదలు పెట్టారు.

ప్రజలకు దగ్గర కావటంతో పాటు, యువత అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 20న ఓ టీవీ ఛానెల్ తో కలిసి నిర్వహించిన హ్యాంగవుట్ కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. యువతతో మమేకమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఏపీని ఎలా అభివృద్ది చేయబోతున్నారో వివరించారు. ఈ వీడియోను సదరు టీవీ ఛానెల్ యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేయగా ఇప్పటివరకు రెండు లక్షల పదివేల మందికి పైగా వీక్షించారు. అది మరి.., బాబు ఫాలోయింగ్ అంటే, సామాన్య ప్రజలే కాదు.., నెటిజన్లు కూడా ఆయన వెంట ఉన్నారనీ, చాణిక్యుడి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఇది స్పష్టం చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Social Media  Andhra Pradesh updates  

Other Articles